ప‌ద్ద‌తి త‌ప్పిన ప‌ద్మావ‌తి.. పోతుందిగా మ‌తి.. 


ప‌ద్మావ‌తి లాంటి సినిమా చేసిన‌పుడు క‌చ్చితంగా ఆ సినిమా ప్ర‌భావం కొన్ని రోజులు ఉంటుంది. కానీ దీపిక‌పై మాత్రం అలాంటిదేమీ ఉన్న‌ట్లు క‌నిపించ ట్లేదు. పైగా ప‌ద్మావ‌తి విడుద‌లైన త‌ర్వాత మ‌రింత హాట్ గా రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. కావాలంటే ఈ మ‌ధ్యే వోగ్ మ్యాగ‌జైన్ పై దీపిక ఇచ్చిన ఫోజులు చూడండి.. అంద‌రికీ అర్థ‌మైపోతుంది ప‌ద్మావ‌తిగా ఎంత‌గా ప‌ద్ద‌తి త‌ప్పిందో..? కొంటెగా తినేసేలా చూస్తుంది దీపిక ప‌దుకోనే. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఈ భామ పిహెచ్ డీకి తాత‌ను పూర్తిచేసింది. పైగా స్టార్ ఇమేజ్ ఉండ‌నే ఉంది. ఈ మ‌ధ్య విడుద‌లైన ప‌ద్మావ‌తి కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రం ఐదు రోజుల్లోనే 200 కోట్లు వ‌సూలు చేసింది. బాజీరావ్ మ‌స్తానీ, రామ్ లీలా లాంటి క్లాసిక్స్ ఇచ్చిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ దీపిక‌కు ఇచ్చిన మూడో క్లాసిక్ సినిమా ప‌ద్మావ‌తి. ఈ చిత్రం కోసం హీరోల కంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది దీపిక ప‌దుకొనే. వాళ్ల‌కి 10 కోట్లు ఇస్తుంటే.. ఈమెకు మాత్రం 13 కోట్లు ఇచ్చారు నిర్మాత‌లు. టైటిల్ రోల్ చేస్తుంది పైగా క్రేజ్ లో కూడా వాళ్ళ‌తో పోలిస్తే దీపిక‌కు ఎక్కువ‌గా రేంజ్ ఉంది అందుకే రెమ్యున‌రేష‌న్ ఎక్కువిస్తున్నారు. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. ఇదిగో అప్పుడ‌ప్పుడూ ఇలా ఫోటోషూట్ల‌తో కుర్రాళ్ల నిద్ర చెడ‌గొడుతుంది ఈ క‌న్న‌డ క‌స్తూరి. ఈ పొడుగు కాళ్ల సుంద‌రి చేసిన ఫోటోషూట్ కు అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోతు న్నాయి. ఈ బ్యూటీ దెబ్బ‌కు ఎన్ని థ‌ర్మామీట‌ర్లు పేలిపోతాయో మ‌రి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here