ప‌ద్మావ‌త్.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్.. 

ఇండియా మొత్తం ప‌ద్మావ‌త్ సినిమా గురించి త‌ప్ప మ‌రో చ‌ర్చ జ‌ర‌గ‌ట్లేదు. ఈ చిత్రాన్ని ఎలాగైనా అడ్డుకుని తీరుతాం అంటూ క‌ర్ణిసేన వార్నింగుల మీద వార్నింగులు ఇస్తుంది. సుప్రీమ్ కోర్ట్ సైతం ఈ చిత్రానికి అండ‌గా నిల‌బ‌డింది కానీ క‌ర్ణిసేన మాత్రం ఏకంగా భార‌త్ బంద్ కు పిలుపునిచ్చింది. అస‌లు జ‌న‌వ‌రి 25న ఏం జ‌ర‌గ‌బోతుందో అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. ఇదిలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అనే అంచ‌నాలు.. ఆస‌క్తికి రెండు రోజుల ముందే తెర దించేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల ప్రీమియ‌ర్స్ కూడా రెండు రోజుల ముందే వేస్తున్నారు. జ‌న‌వ‌రి 23నే హైద‌రాబాద్ లో స్పెష‌ల్ ప్రీమియ‌ర్ ప‌డుతుంది. సెలెబ్రెటీస్ తో పాటు మీడియా ప్ర‌ముఖులకు కూడా రెండ్రోజుల ముందే సినిమా చూపిస్తున్నారు. ఎలాగూ సినిమా బాగుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టి ముందుగానే ప్రీమియ‌ర్ వేసినా న‌ష్టం లేదనుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దానివ‌ల్ల సినిమాలో ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీలు లేవ‌ని.. ఏ భ‌యం లేకుండా సినిమాను విడుద‌ల చేసుకోవ‌చ్చ‌నే న‌మ్మ‌కం థియేట‌ర్ ఓన‌ర్ల‌లో కూడా క‌లుగుతుంది. ఇది కూడా ఓ స్ట్రాట‌జీనే. ఎందుకంటే మీడియాకు ముందే షో వేస్తే.. వాళ్లే సినిమాను ప్ర‌మోట్ చేస్తారు. మొత్తానికి చూడాలిక‌.. ప‌ద్మావ‌త్ కు ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో ఇక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here