ప‌ర్లేదే.. థ‌మ‌న్ బాగా మారిపోయాడు..!

SS THAMAN MOVIES FAST RACE
ఆశ్చ‌ర్యం.. ఆనందం.. అంతుచిక్క‌ని విష‌యం.. ఇవ‌న్నీ ఇప్పుడు థ‌మ‌న్ పాట‌లు వింటుంటే వ‌స్తుంది. అంత ఆశ్చ‌ర్యం ఏముంది అందులో.. ఎప్పుడూ వినే పాట‌లే క‌దా అనుకుంటున్నారా..? ఎప్పుడూ వినే పాట‌లైతే పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. కానీ ఇప్పుడు థ‌మ‌న్ చాలా మారిపోయాడు. ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్ లో ఏదో మాయ చేసాడు తొలిప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. ఏం చేసాడో.. ఎంత క్లాస్ పీకాడో తెలియ‌దు కానీ తొలిప్రేమ నుంచి థ‌మ‌న్ మ్యూజిక్ అంతా మారిపోయింది. ఈయ‌న పాట‌లు అని.. పేరు చూసేవ‌ర‌కు కూడా గుర్తు ప‌ట్ట‌లేం. అంత ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తున్నాడు థ‌మ‌న్. నితిన్ హీరోగా న‌టించిన ఛ‌ల్ మోహ‌న్ రంగాకు థ‌మ‌నే సంగీత ద‌ర్శ‌కుడు. ఇందులో ఒక్కోపాట విడుద‌ల‌వుతున్న కొద్దీ సినిమాపై అంచ‌నాలు బాగానే పెరుగుతున్నాయి. తాజాగా పెద్ద‌పులి అంటూ ప‌క్కా మాస్ బీట్ విడుద‌ల చేసాడు థ‌మ‌న్. ఇది ఆల్రెడీ తెలంగాణ‌లో ఉన్న ఫోక్ బీట్. దీన్నే త‌న‌దైన శైలిలో రీమిక్స్ చేసాడు థ‌మ‌న్. ఛ‌ల్ మోహ‌న్ రంగాలో విడుద‌లైన మిగిలిన పాట‌ల‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ ఓ నిర్మాత‌. ఇక్క‌డ సంగీతం న‌చ్చే.. ఎన్టీఆర్ సినిమాకు పాట‌లు కొట్టే అవ‌కాశం ఇచ్చాడు త్రివిక్ర‌మ్. ఒక్క‌సారి మాట‌ల మాంత్రికుడికి క‌నెక్ట్ అయితే ఆ సంగీత ద‌ర్శ‌కుడి రేంజ్ మారిపోయిన‌ట్లే. మ‌రి ఇప్పుడు థ‌మ‌న్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here