ప‌వ‌న్ అంద‌రికీ మొగుడే ఇప్పుడు..


రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు.. మిత్రులు ఉండ‌ర‌నేది ఎప్ప‌ట్నుంచో వినిపిస్తున్న మాటే. ఇప్పుడు దాన్ని మ‌రోసారి నిజం చేసాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మొన్న‌టి ఎన్నిక‌ల్లో స్నేహంగా ఉన్నాడు.. పిలిచిన‌పుడు వ‌చ్చాడు.. ప్ర‌చారం చేసాడు.. టీడిపిని గెలిపించాడు క‌దా ఇప్ప‌టికీ మిత్ర‌ప‌క్షంగానే ఉన్నాడు అనుకున్నారేమో..? ఆయ‌న లోప‌ల మాత్రం ఒరిజిన‌ల్ మ‌రోలా ఉందని ఇప్పుడు అర్థ‌మైపోయింది అంద‌రికీ. ప‌వ‌న్ ఎవ‌రికీ తొత్తు కాదు.. పొత్తు కాదు.. సొత్తు కాదు.. ఆయ‌న ఓ రెబ‌ల్. అవ‌స‌రం అయితే ప్రాణాలు ఇవ్వ‌డానికి కూడా సిద్ధ‌మంటున్న ఓ రెబ‌ల్. ఆయ‌న్ని చూసి ఇప్పుడు మిత్ర‌ప‌క్షాలు.. శ‌త్రుప‌క్షాలు అన్నీ భ‌య‌ప‌డుతున్నాయి. ప‌వ‌న్ తో క‌లిసి వెళ్లాలంటేనే ఒక్కొక్క‌రికీ ఇప్పుడు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ప‌వ‌న్  మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.
రాజ‌కీయాల్లో శాంతంగా ఉంటేనే ప‌నులు జ‌రుగుతాయి అంటారు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లో అది ఏ కోశానా క‌నిపించ‌ట్లేదు. అస‌వ‌రం అయితే తెగింపు ఏ ద‌శ‌కైనా వెళ్లేలా ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్. తాజాగా జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ స్పీచ్ అంద‌ర్నీ ఆలోచింప‌చేసింది. ఇన్నాళ్లూ త్రివిక్ర‌మ్ స్క్రిప్ట్ చ‌దువుతాడు అని ప‌వ‌న్ పై ఎద్దేవా చేసారంతా. తెలుగుదేశంను ఎప్పుడూ ఏం అన‌డు.. వాళ్ల‌కు స‌పోర్ట్ గానే ప‌వ‌న్ ఉంటాడు.. జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తాడు అంటూ విమ‌ర్శ‌లు చేసేవాళ్లు. కానీ ఈ స‌భ‌లో మాత్రం ఏకంగా టీడిపిని ఎక్కేసాడు ప‌వ‌ర్ స్టార్. వాళ్ల‌పైనే త‌న దృష్టంతా పెట్టాడు. సిఎంను కూడా వ‌ద‌ల్లేదు. న‌మ్మిన ప్రజ‌ల‌ను మోసం చేస్తే.. చేతులు క‌ట్టుకుని కూర్చోనంటూ హెచ్చ‌రించాడు.
తెలుగుదేశంపై ప‌వ‌న్ వైఖ‌రి చూసి ఇప్పుడు ఆ పార్టీ కూడా షాక్ అవుతుంది. అస‌లు ప‌వ‌న్ ఎలాంటి వాడో అర్థం చేసుకోలేక‌పోతున్నారు వాళ్లు. నిజంగా ఇలాంటి ఆవేశ‌ప‌రుడు రాజ‌కీయాల‌కు ప‌నికొస్తాడా అంటున్నారు విశ్లేష‌కులు. కానీ త‌న‌ది ఆవేశం కాదు ఆవేద‌న‌.. ప్ర‌జ‌ల కోసం తాను ఎంత క‌ష్టానికైనా సిద్ధం అంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇక‌పై పాతికేళ్లు పూర్తిగా ప్ర‌జా జీవితంలోనే ఉండ‌టానికి తాను సిద్ధ‌మంటూ ప్ర‌క‌టించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈ తెగింపు చూసే ఇప్పుడు మిగిలిన పార్టీలు కూడా భ‌య‌ప‌డుతున్నాయి. ఇన్నాళ్లూ ప‌వ‌న్ ఇచ్చిన స్పీచుల‌కు.. ఇప్పుడు మాట్లాడిన మాట‌ల‌కు చాలా తేడా ఉంది. ఎంతో మెచ్యూరిటి క‌నిపించింది ఆ మాట‌ల్లో.
చూస్తుంటే 2019 ఏపీ ఎన్నిక‌ల ముఖ చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్చేలా క‌నిపిస్తున్నాడు. ఇదే ఇప్పుడు అంద‌ర్లోనూ భ‌యం పుట్టిస్తుంది. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితులు చూస్తుంటే మ‌రోసారి టీడిపితో క‌లిసి వెళ్లే ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌నిపించ‌ట్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో తాను గెలిపించింది టీడిపిని కాద‌ని.. ఏపీని బాగు చేస్తారేమో అని న‌మ్మిన ఓ సీనియ‌ర్ పార్టీని అని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. కానీ ఈ సారి మాత్రం ఈయ‌న సొంతంగానే ఎన్నిక‌ల్లో పోటీకి సై అంటున్నాడు. పైగా ఓటుకు డ‌బ్బులిస్తే తీసుకొని.. అంతా జ‌న‌సేన‌కు ఓటేయండి అంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఎలాగూ త‌న‌తో డ‌బ్బులు లేవ‌ని.. అందుకే టీడిపి వాళ్లు ఇస్తే తీసుకోవాలంటూ చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. మొత్తానికి ఇప్పుడు ఈయ‌న దూకుడు చూసి అన‌స‌వ‌రంగా అప్పుడు ఈయ‌న‌తో సున్నం పెట్టుకున్నాం అని ఫీల్ అవుతున్నారు టీడిపి.. బిజేపి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here