ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో మాస్ రాజా..

PAVAN RETIRE FROM MOVIES
ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓ ద‌ర్శ‌కుడు న‌మ్ముకోవ‌డం అంటే స్వీయ అప‌రాధం చేసిన‌ట్లే. ఆయ‌న్ని న‌మ్ముకుంటే ఏం చేస్తామో.. ఎలా చేస్తామో.. ఎప్పుడు సినిమా చేస్తామో క్లారిటీ ఉండ‌దు. ఆయ‌నంతే అదోటైపు. ప‌వ‌ర్ స్టార్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌టంతో సినిమాల‌కు పూర్తిగా దూరం అయిపోయిన‌ట్లే ఇక‌. ఇది తెలియ‌క సంతోష్ శ్రీ‌నివాస్ ఆయ‌న కోసం రెండేళ్ళుగా వేచి చూస్తూనే ఉన్నాడు. ప‌వ‌న్ తో సినిమాకు క‌మిటైతే ఇక ఆ ద‌ర్శ‌కుల కెరీర్ ఇంక‌ అంతేనా అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది. ఒక‌ప్పుడు సంప‌త్ నంది.. ఆ త‌ర్వాత ఆర్టీ నీస‌న్.. ఇప్పుడు సంతోష్ శ్రీ‌నివాస్.. ఇలా ఒక్కొక్క‌రుగా ప‌వ‌న్ ను న‌మ్మి మునిగిపోతున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ తో ప‌వ‌న్ చేయాల్సిన సినిమా సంతోష్ శ్రీ‌నివాస్ తోనే. ఇప్పుడు ఈ చిత్రం కూడా ఆగిపోయింది. ఇప్ప‌ట్లో త‌న‌కు సినిమాలు చేసే ఉద్దేశ్య‌మే లేద‌ని తెగేసి చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. దాంతో సంతోష్ ఏడాది న్న‌ర ఎదురుచూపులు బూడిద‌లో పోసిన ప‌న్నీరైపోయాయి. ఇప్పుడు ఇదే సినిమాను ర‌వితేజ‌తో చేయాల‌ని చూస్తున్నాడు సంతోష్. ఎందుకంటే నాని కూడా ఈ క‌థ‌పై అనాస‌క్తి చూపించాడు. దాంతో అటు తిరిగి ఇటు తిరిగి అది ర‌వితేజ వ‌ద్ద‌కు వ‌చ్చి ఆగింది. ఇది త‌మిళ్ లో హిట్టైన తెరీ సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది. అది ఆల్రెడీ తెలుగులో పోలీసోడుగా వ‌చ్చింది. మ‌ళ్లీ ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేసి ఏం లాభం..? మ‌రి చూడాలిక‌.. ర‌వితేజ కోసం కొత్త క‌థ సిద్ధం చేస్తాడా లేదంటే ఉన్న క‌థ‌తోనే కానిచ్చేస్తాడా అని..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here