ప‌వ‌న్.. నితిన్.. ఇద్ద‌రూ దెబ్బేసారుగా..!


చూస్తుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్.. నితిన్ కెరీర్ లు ఒకే ట్రాక్ లో న‌డుస్తున్న‌ట్లు అనిపిస్తుంది. క్రేజ్ ప‌రంగా ఇద్ద‌రూ వేరైనా కూడా కెరీర్ ప‌రంగా మాత్రం గురు శిష్యులు ఒకే ట్రాక్ లో న‌డుస్తున్నారు. 2004లో సై త‌ర్వాత 2012 వ‌ర‌కు నితిన్ కు విజ‌యాలు లేవు. ఇష్క్ తో మ‌ళ్లీ గాడిన ప‌డ్డాడు ఈ హీరో. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఖుషీ త‌ర్వాత హిట్లు లేక 2012లోనే గ‌బ్బ‌ర్ సింగ్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఆ మ‌రుస‌టి ఏడాది అత్తారింటికి దారేదితో ప‌వ‌న్ ఇండ‌స్ట్రీ హిట్ కొడితే..
గుండెజారి గ‌ల్లంత‌యిందేతో నితిన్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. హార్ట్ ఎటాక్ తో నితిన్ యావ‌రేజ్ అందుకుంటే.. గోపాలా గోపాలా సినిమాతో ప‌వ‌న్ అదే చేసాడు. ఇక చిన్న‌దాన నీకోసం, కొరియర్ బాయ్ క‌ళ్యాణ్ లాంటి డిజాస్ట‌ర్లు నితిన్ కు వ‌చ్చిన టైమ్ లోనే ప‌వ‌న్ కు స‌ర్దార్, కాట‌మ‌రాయుడు వ‌చ్చాయి. ఇక అ..ఆతో హిట్ కొట్టి.. లైతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు నితిన్. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న 25వ సినిమా అజ్ఞాత‌వాసితో వ‌చ్చాడు.
ఇక నితిన్ కూడా 25వ సినిమా ఛ‌ల్ మోహ‌న్ రంగాను సిద్ధం చేసాడు. ఏడాది మొద‌ట్లో వ‌చ్చిన ఈ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది. 150 కోట్ల బిజినెస్ చేసిన సినిమా కాస్తా 57 కోట్ల ద‌గ్గ‌రే ప్ర‌యాణం ముగించింది. ఇక నితిన్ 25వ సినిమా చ‌ల్ మోహ‌న్ రంగా సైతం ఫ్లాప్ అయింది. కృష్ణ‌చైత‌న్య తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కామెడీ త‌ప్ప క‌థ లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ఎక్క‌లేదు. దాంతో సినిమా ఫ్లాప్ లిస్ట్ లోకి ఎక్కేసింది. మొత్తానికి అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇటు నితిన్ ఇద్ద‌రూ త‌మ త‌మ 25వ సినిమాల‌తో ఫ్లాపులు ఇచ్చి అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here