ప‌వ‌న్ లో మార్పుకు కార‌ణ‌మేంటి..?

Pawan Kalyan Jtv
అదేంటి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం మారాడు..? అలాగే క‌దా ఉన్నాడు..? ఇప్పుడు కొత్త‌గా ఏం క‌నిపిస్తున్నాడు అనుకుంటున్నారా..? ఈ మార్పు లోప‌ల క‌నిపించేది.. బ‌య‌టికి క‌నిపించేది కాదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే చాలా రిజ‌ర్వ‌డ్. ఎక్క‌డా బ‌య‌ట వేడుక‌ల‌కు రాడు.. ఆ మాటకొస్తే త‌న సినిమాల‌కే త‌ను ఫంక్ష‌న్లు చేసుకోడు.
నిర్మాత‌లు బ‌ల‌వంత‌పెడితే త‌ప్ప బ‌య‌టికి రాడు. అలాంటి వాడు ఇప్పుడు బ‌య‌టి వాళ్ల ఫంక్ష‌న్ల‌కు వ‌స్తున్నాడు. నితిన్ ఛ‌ల్ మోహ‌న్ రంగా ప్రీ రిలీజ్ వేడుక‌లో ప‌వ‌ర్ స్టార్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచాడు. ఇక రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌న్ రాక‌తో ఆ రోజు వేడుక అంతా సంద‌డిగా మారింది. ఇక ఇప్పుడు ర‌వితేజ నేల‌టికెట్ ఆడియో వేడుక‌కు కూడా వ‌స్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. మే 10న జ‌ర‌గ‌బోయే ఈ ఈవెంట్ కు ప‌వ‌ర్ స్టార్ వ‌స్తున్న‌ట్లు క‌న్ఫ‌ర్మ్ చేసాడు నిర్మాత రామ్ త‌ళ్ళూరి. ప‌వ‌న్ వ‌స్తున్న‌ది కూడా ఈయ‌న కోస‌మే.
ఆర్నెళ్లుగా ప‌వ‌న్ తో చాలా స‌న్నిహితంగా ఉంటున్నాడు రామ్. ఈ ప‌రిచ‌యంతోనే ర‌వితేజ సినిమాకు ఛీఫ్ గెస్ట్ గా రావ‌డానికి ప‌వ‌న్ ఒప్పుకున్నాడు. ఈయ‌న సినిమాల‌కు దూరంగా ఉన్నాడు కానీ ఇండ‌స్ట్రీకి మాత్రం కాదు. పైగా రాబోయే ఎన్నిక‌ల్లో అంద‌రి మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మే కాబ‌ట్టి అడిగిన వెంట‌నే ఫంక్ష‌న్ ల‌కు రావ‌డానికి ఒప్పుకుంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. మ‌రి చూడాలిక‌.. ర‌వితేజ‌కు ప‌వ‌న్ లెగ్గు ఎంత‌వ‌ర‌కు క‌లిసొస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here