ప‌వ‌న్ సినిమా పాలిటిక్స్.. 

Trivikram bold decision for Agnathavasi
అవును.. ఇప్పుడు నిజంగానే సినిమా పాలిటిక్స్ చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. అంటే పాలిటిక్స్ ను సినిమా చేయ‌డం కాదు.. సినిమాల‌ను పాలిటిక్స్ ను స‌రిగ్గా బ్యాలెన్స్ చేస్తున్నాడ‌ని అర్థం. టైమ్ మేనేజ్ మెంట్ విష‌యంలో ప‌వ‌న్ కంటే తోపు ఎవ‌రూ లేరేమో ఇప్పుడు. మొన్న‌టి వ‌ర‌కు అజ్ఞాత‌వాసి షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మూన్నెళ్ల పాటు మ‌రే ప‌ని పెట్ట‌కోకుండా సినిమాను పూర్తి చేసాడు. చేసిన వెంట‌నే జ‌నాల్లోకి వెళ్లి పోయాడు జ‌న‌సేనాని. అక్క‌డ మూడు రోజులు మీటింగ్ అయిపోయాయో లేదో వెంట‌నే ఇప్పుడు సినిమా ప‌నిపై బిజీ అయ్యాడు. ప‌వ‌న్ ఇప్పుడు హైద‌రాబాద్ లోనే ఉన్నాడు. అది కూడా ప్ర‌సాద్ డ‌బ్బింగ్ థియేట‌ర్లో. అజ్ఞాత‌వాసి డ‌బ్బింగ్ చెబుతున్నాడు ప‌వ‌న్. ఈ చిత్ర ఔట్ పుట్ బ్ర‌హ్మాండంగా వ‌చ్చింద‌ని తెలుస్తుంది. ఈ చిత్రంతో క‌చ్చితంగా ప‌వ‌న్ ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేస్తాడ‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. ప‌వ‌న్ ఈ రికార్డులు బ‌ద్ద‌లుకొడితే ముందుగా పగిలేది అన్న‌య్య రికార్డులే. ఖైదీ నెం.150తో ప‌దేళ్ల త‌ర్వాత వ‌చ్చినా కూడా రికార్డులు తిర‌గ‌రాసాడు మెగాస్టార్. ఆయ‌న పేరుమీదే ఇప్పుడు 104 కోట్ల రికార్డ్ ఉంది. ఈ లిస్ట్ లో బాహుబ‌లి అద‌నం. అది కాకుండా రెండో రికార్డు కోసమే ఇక్క‌డ పోటీ. ఇప్పుడు దానికోస‌మే ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నాడు. మొత్తానికి అజ్ఞాత‌వాసి డ‌బ్బింగ్ మ‌రో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఈ నెల‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here