ఫ్లాప్స్ ఉన్నా టెన్ష‌న్ లేదే..!

SUSHANTH VIJAY DEVARAKONDA NITHIN
సాధార‌ణంగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలంటే టెన్ష‌న్ తో కాపురం చేస్తుంటారు. త‌మ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ నిద్ర కూడా పోరు. కానీ ఇక్క‌డ మాత్రం ముగ్గురు హీరోలు చాలా కూల్ గా క‌నిపిస్తున్నారు. ఫ్లాపులు ఉన్నా కూడా ఈ సారి మాత్రం ప‌క్కా హిట్ కొడ‌తాం చూసుకోండంటూ స‌వాల్ చేస్తున్నారు.
వాళ్లే నితిన్.. విజ‌య్ దేర‌వ‌కొండ‌.. సుశాంత్. ఈ ముగ్గురు వ‌ర‌స వారాల్లో వ‌స్తున్నారు. ఆగ‌స్ట్ 3న అంద‌రికంటే ముందు వ‌స్తున్నాడు సుశాంత్. ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యం లేని ఈ కుర్ర హీరో చిలసౌ అంటూ వ‌స్తున్నాడు. రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై ముందు పెద్ద‌గా ఆస‌క్తి లేక‌పోయినా ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత అంచ‌నాలు పెరిగిపోయాయి. క‌చ్చితంగా ఇది ఆడేట్లుగానే క‌నిపిస్తుంది. ఇక నితిన్ కూడా ఆగ‌స్ట్ 9న శ్రీ‌నివాస క‌ళ్యాణంతో వ‌స్తున్నాడు.
దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇండ‌స్ట్రీలో ఉన్న 80 శాతం న‌టీన‌టులు ఈ చిత్రంలో క‌నిపించ‌డం విశేషం. శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కిస్తోన్న సినిమా ఇది. లై.. ఛ‌ల్ మోహ‌న్ రంగా ఫ్లాపుల త‌ర్వాత నితిన్ చేసిన సినిమా ఇది. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా అర్జున్ రెడ్డి అరాచ‌కం త‌ర్వాత ఏం మంత్రం వేసావే అంటూ వ‌చ్చెళ్లిపోయాడు.
అదొచ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. మ‌హాన‌టిలో న‌టించినా అది అతిథి పాత్రే. దాంతో ఇప్పుడు గీత‌గోవిందంతో హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు. ఆగ‌స్ట్ 15న ఈ చిత్రం విడుద‌ల కానుంది. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు త‌ర్వాత ప‌రుశురామ్ తెర‌కెక్కించిన సినిమా ఇది. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే చిల‌సౌ.. శ్రీ‌నివాస క‌ళ్యాణం.. గీత‌గోవిందం మూడు పెళ్లి కాన్సెప్ట్ తోనే తెర‌కెక్కిన సినిమాలే. మ‌రి ఈ మూడింట్లో ఏది హిట్ అవుతుందో.. ఈ హీరోల న‌మ్మ‌కాల్లో ఎవ‌రిది నిజం అవుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here