అదేంటి.. కొంపదీసి ఆయన బయోపిక్ గానీ చేస్తున్నారా ఏంటి.. అయినా ఆ పాత్రలో విజయ్ ఎలా సెట్ అవుతాడు అనుకుంటున్నారా.. అదేం కాదులె కానీ ఇప్పుడు ఇలాంటి పాత్రలోనే నటించబోతున్నాడు విజయ్ దేవరకొండ. సాధారణంగా మనోడి పేరు వినగానే ముందు అర్జున్ రెడ్డి లాంటి ఆటిట్యూడ్ గుర్తుకు వస్తుంది. కానీ దాంతో ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండలేం అని గుర్తు పెట్టుకున్నాడు విజయ్.
అందుకే ఇమేజ్ మేకోవర్ కోసం మ్యాగ్జిమమ్ ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే గీతగోవిందంలో ఈయన చేసిన పాత్ర కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ట్యాక్సీవాలాలో కూడా క్లీన్ రోల్ చేస్తున్నాడు ఈ హీరో.
ఈ రెండు సినిమాలతో పాటు తెలుగు, తమిళ్ లో ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తోన్న నోటా సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఇందులో రాజకీయ నాయకులకు ఎదురు నిలిచి పోరాడే పాత్రలో నటిస్తున్నాడు విజయ్.
ఇక ఇప్పుడు డియర్ కామ్రేడ్ లో సోషల్ యాక్టివిస్ట్ అంటే.. బాబు గోగినేని తరహా పాత్రలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. రష్మిక మందన్న మరోసారి ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా నటిస్తుంది. మొత్తానికి సామాజిక బాధ్యత గల కథల్లో నటిస్తూ తాను మారిపోయానని నిరూపించుకుంటున్నాడు విజయ్.