బాబ‌య్య అంటూ విజ‌య్ సేతుప‌తి.. 

Sye Raa Narasimha Reddy second schedule
అదేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు విజ‌య్ సేతుప‌తి త‌మిళ్ హీరో మాత్ర‌మే. కానీ 2019 నాటికి ఈయ‌న తెలుగు హీరో అయిపోతాడు. దానికి కార‌ణం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు న‌టించ‌బోతున్నాడు విజ‌య్. ఇందులో ఓ కీల‌కపాత్ర కోసం చిరంజీవే స్వ‌యంగా విజ‌య్ సేతుప‌తిని ఎంపిక చేసుకున్నాడు. సైరాలో అత్యంత కీల‌క‌మైన బాబ‌య్య పాత్ర‌కు విజ‌య్ ను తీసుకున్నార‌ని తెలుస్తుంది. ఉయ్యాలవాడ న‌ర‌సిం హారెడ్డి జీవితంలో బాబ‌య్య పాత్ర కీల‌కం. ఈయ‌న వెంటే ఉంటూ.. న‌ర‌సింహారెడ్డి కోసం ప్రాణాలైనా ఇచ్చే పాత్ర ఇది. ఇలాంటి పాత్ర కోసం విజ‌య్ ను తీసుకున్నాడు మెగాస్టార్. విజ‌య్ సేతుప‌తి చేసేది ఈ పాత్రే అని క్లారిటీ లేక‌పోయినా.. వినిపిస్తున్న వార్త‌లైతే ఇవే. పైగా ఈ పాత్ర‌కు ఇప్ప‌టికే స్క్రీన్ టెస్ట్ కూడా అయిపోయింది. ఫిబ్ర‌వ‌రి నుంచి సెట్ లో అడుగుపెట్ట‌నున్నాడు విజ‌య్ సేతుప‌తి. చూడాలిక‌.. విజ‌య్ ఈ పాత్ర‌లో ఎలాంటి మాయ చేయ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here