బాల‌య్య అంతా తెలిసే చేస్తున్నాడా..?


ఏమో ఇప్పుడు జ‌రుగుతున్న తీరు చూస్తుంటే నిజంగా అంతా బాల‌య్య తెలిసే చేస్తున్నాడా..? లేదంటే నిజంగానే ఆయ‌న అంత అమాయాకుడా అనిపించ‌క మాన‌దు. సినిమాల ప‌రంగా ఆయ‌న స్టార్ హీరో.. అందులో ఎవ‌రికీ అనుమానాలు అవ‌స‌రం లేదు. కానీ రాజ‌కీయాల ప‌రంగా మాత్రం బాల‌య్య ఇంకా ఎద‌గాలి..
చాలా రాటుదేలాలి అని విశ్లేష‌కులు చెబుతుంటారు. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి చూసిన‌పుడు అది నిజ‌మే అనిపిస్తుంది కూడా. ఇప్పుడు కూడా ఇదే మ‌రోసారి ప్రూవ్ అయింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడిని ఉద్ధేశించి ఆయ‌న మాట్లాడిన మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అస‌లు బాల‌య్య తెలిసే అలా మాట్లాడాడా లేదంటే ముందు జ‌నం.. నోటి ముందు మైక్ ఉంది క‌దా హిందీలో ఇష్ట‌మొచ్చిన‌ట్లు వాగేసాడా అంటున్నారు ప్ర‌తిప‌క్షాలు.
బిజేపి అయితే బాల‌య్యతో సారీ చెప్పించే వ‌ర‌కు నిద్ర‌పోం అంటున్నారు. అరెస్ట్ వారెంట్ తెచ్చుకున్నారు. ఇలా చాలా జ‌రుగుతున్నాయి ఇప్పుడు. రాజ‌కీయంగా ఈయ‌న చేసే ప‌నులు ఇప్పుడు చంద్ర‌బాబుకు కూడా త‌ల‌నొప్పులు తెస్తున్నాయి. ఇన్నాళ్లూ కొడుకు లోకేష్ మాత్ర‌మే బాబుకు క‌ష్టాలు తెచ్చిపెడ‌తాడేమో అనుకుంటుంటే.. ఇప్పుడు బామ్మ‌ర్ది బాల‌య్య కూడా తోడ‌య్యాడు. ఇక చూడాలిక‌.. ఫ్యూచ‌ర్ లో అయినా బాల‌య్య త‌న నోటిని అదుపులో పెట్టుకుంటాడో లేదంటే ఇలాగే మాట్లాడేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here