బాల‌య్య గ్యారేజ్.. ఫ్లాప్ ద‌ర్శ‌కుల‌కు ఛాన్సివ్వ‌బ‌డును..!


అవును.. ఇప్పుడు బాల‌య్య ఇదే చేస్తున్నాడు. ఓ గ్యారేజ్ ఓపెన్ చేసి ఏరికోరి మ‌రీ ఫ్లాప్ ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇస్తున్నాడు. ఇప్పుడు కాదు.. బాల‌య్య ఎప్పుడూ ట్రాక్ రికార్డ్ చూడ‌డు. క‌థ న‌చ్చితే గుడ్డిగా ద‌ర్శ‌కుల‌ను న‌మ్మేస్తాడు. పాపం.. ఈ న‌మ్మ‌కమే ఆయ‌న్ని చాలా సార్లు దెబ్బ‌తీసింది కూడా.
అయినా కూడా మ‌ళ్లీ మ‌ళ్లీ అదే చేస్తుంటాడు బాల‌కృష్ణ‌. మొన్న‌టికి మొన్న కూడా క్రిష్ కు గౌత‌మీపుత్ర ఇచ్చాడు.. పూరీకి పైసావ‌సూల్ ఇచ్చాడు.. ఇక మొన్న సంక్రాంతికి కేఎస్ ర‌వికుమార్ కు జై సింహా ఇచ్చాడు. ఇందులో ఒక్క పూరీ మాత్ర‌మే ఫ్లాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు తేజ‌తో ఈయ‌న ఎన్టీఆర్ బ‌యోపిక్ చేస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌క‌ముందే మ‌రో రెండు సినిమాలు కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు ఈ హీరో.
బోయ‌పాటి శీను సినిమా ఇప్ప‌టికే లైన్ లో ఉండ‌గా.. తాజాగా వినాయ‌క్ కూడా వ‌చ్చాడు. ఈ సినిమాను కూడా సి క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నాడు. వినాయ‌క్ తో ఈ మ‌ధ్యే ఇంటిలిజెంట్ సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు క‌ళ్యాణ్. కానీ మ‌రోసారి ఆయ‌న‌కే ఛాన్సిస్తున్నాడు. అయితే వినాయ‌క్ కు ఆఫ‌ర్ ఇచ్చినా మ‌రో ఏడాదిన్న‌ర వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే తేజ‌తో పాటు బోయ‌పాటి సినిమాలు అయిపోయేస‌రికి మ‌రో ఏడాదైనా టైమ్ ప‌డుతుంది కాబ‌ట్టి. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు వినాయ‌క్ వేచి చూస్తాడా లేదంటే మ‌రో హీరోతో స‌ర్దుకుపోతాడా చూడాలిక‌..! అన్న‌ట్లు ఈ కాంబినేష‌న్ లో 15 ఏళ్ల కింద చెన్న‌కేశవ రెడ్డి సినిమా వ‌చ్చింది. అది జ‌స్ట్ యావ‌రేజ్ గా ఆడిందంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here