బాషా సీక్వెల్ పై ర‌జినీ క‌మెంట్స్..

ర‌జినీకాంత్ ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని విజ‌యాలు అందుకున్నా కూడా బాషా సినిమాకు ఉన్న ప్ర‌త్యేక‌త‌ వేరు. ఈ సినిమా అప్ప‌ట్లో కాదు.. ఇప్ప‌టికీ సంచ‌ల‌న‌మే. అదేం విచిత్ర‌మో కానీ ఈ చిత్రాన్ని మ‌ళ్లీ విడుద‌ల చేసినా కూడా ప్రేక్ష‌కులు చూసారు. అదీ బాషా ప‌వ‌ర్. నేనొక్క‌సారి చెబితే వంద సార్లు చెప్పిన‌ట్లు అని ర‌జినీకాంత్ చెబితే అంతా ఫిదా అయిపోయారు. అది ఆయ‌న త‌ప్ప మ‌రెవ‌రూ చెప్ప‌లేరు.. చేయ‌లేరు..!

క‌నీసం బాషా పేరు వాడుకోడానికి కూడా భ‌య‌పడ‌తారు. అది బాషా ప‌వ‌ర్. అందుకే సినిమా వ‌చ్చి ఇన్నేళ్ళైనా బాషా ప‌వ‌ర్ ఇంకా త‌గ్గ‌లేదు. ఈ క్రేజ్ ను గ‌మ‌నించి.. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా బాషాకు కొత్త హంగులు అద్ది విడుద‌ల చేసారు. డిజిట‌లైజ్ చేసి.. 5.1 స‌రౌండ్ సౌండ్ లో మ‌ళ్లీ తీసుకొచ్చినా చూసారు. ఇక ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్ పై కూడా మ‌నసు విప్పాడు ర‌జినీకాంత్. త‌న‌కు సీక్వెల్ లో న‌టించే ఉద్ధేశ్య‌మే లేద‌ని..

ఇలాంటి క్లాసిక్స్ ను ముట్టుకోక‌పోవ‌డ‌మే మంచిది అని చెప్పాడు ర‌జినీకాంత్. అస‌లు బాషా సీక్వెల్ క‌థ‌ను ర‌జినీ ద‌గ్గ‌రికి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు సాయిర‌మ‌ణి. లారెన్స్ తో ప‌టాస్ రీమేక్ చేసిన ద‌ర్శ‌కుడు ఈయ‌న‌. ర‌జినీకాంత్ కు క‌థ చెప్పినా ఆయ‌న నో చెప్పేసాడు. కావాలంటే మ‌రో క‌థ చేద్దాం కానీ బాషా సీక్వెల్ మాత్రం వ‌ద్ద‌నేసాడు. అస‌లే ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న ర‌జినీకి ఇలాంటి సాహ‌సాలు అవ‌స‌ర‌మా..? అందుకే బాషాకు నో చెప్పాడు ఈ హీరో. ప్ర‌స్తుతం కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమాలో న‌టిస్తున్నాడు ర‌జినీకాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here