బాహుబ‌లి చేయ‌లేదు.. మ‌రి రంగ‌స్థ‌లం..!

Rangasthalam China

బాహుబ‌లి ఎన్ని రికార్డులు సృష్టించినా ఒక్క చోట మాత్రం ఈ చిత్రం ఫెయిల్ అయింది. దాన్ని అందుకోడానికి ఇప్పుడు సిట్టిబాబు బ‌య‌ల్దేరుతున్నాడు. ఇప్ప‌టికే బాహుబ‌లి త‌ర్వాత అన్ని రికార్డుల‌ను త‌న పేర రాసుకున్న మెగా వార‌సుడు.. ఇప్పుడు బాహుబ‌లి తిర‌గ‌రాయ‌లేని రికార్డుల‌ను కూడా తాను రాస్తానంటున్నాడు. అదే చైనా బాక్సాఫీస్. ఇప్ప‌టి వ‌ర‌కు చైనా అంటే కేవ‌లం బాలీవుడ్ సినిమాల సొత్తు అన్న‌ట్లుంది ప‌రిస్థితి. అక్క‌డ పీకే.. దంగ‌ల్.. సీక్రేట్ సూప‌ర్ స్టార్.. భ‌జ‌రంగీ భాయీజాన్.. ఇలా అన్ని సినిమాలు అక్క‌డ వెళ్లి సంచ‌ల‌నం సృష్టించాయి. ఇప్పుడు టాయ్ లెట్ సినిమా కూడా మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. వీట‌న్నింటిలో కామ‌న్ గా క‌నిపించిన పాయింట్ అన్ని సినిమాలు ఎమోష‌నల్ కంటెంట్ తో తెర‌కెక్కిన‌వే.

చైనీయులు బాగా ఫీల్ అవుతుంటార‌న్న‌మాట‌.. వాళ్ల‌ను ఏడిపిస్తే డ‌బ్బులిస్తుంటారు. కానీ ఏం చేస్తాం.. బాహుబ‌లిలో ఆ ఏడుపులు ఎమోష‌న‌ల్ కంటే యుద్ధాలు ఎక్కువ‌గా ఉంటాయి. వాళ్లు చూడ‌ని యుద్ధాలు కాదుకదా అందుకే రెండు భాగాల‌ను వాళ్లు రిజ‌క్ట్ చేసారు. అయితే ఇప్పుడు రంగ‌స్థ‌లం ఆ లోటు తీర్చ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇందులో కావాల్సినంత ఎమోష‌న్ ఉంది. ఏడ‌వ‌డానికి ఓపిక ఉండాలే కానీ ట‌న్నులు ట‌న్నులు ఎమోష‌న్ పంచుతాడు సిట్టిబాబు. ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు రంగ‌స్థ‌లంను చైనాలో విడుద‌ల చేయ‌బోతున్నారు. క‌చ్చితంగా అక్క‌డ ఈ చిత్రం మంచి వ‌సూళ్లు సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో.. సిట్టిబాబు ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here