బిగ్ బాస్..కెట్ లో బిగ్ బిస్కెట్..!

ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 2లో ఉన్న కంటెస్టెంట్ల‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది అంద‌రికీ. తొలి సీజ‌న్ టైమ్ లో ఎన్టీఆర్ త‌న ఇమేజ్ తో షో ను బాగానే న‌డిపించాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే ఆ సీజ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్. మొద‌ట్లో కాస్త నెగిటివ్ టాక్ వ‌చ్చినా కూడా బిగ్ బాస్ తొలి సీజ‌న్ పెద్ద హిట్ అయింది. దానికి కార‌ణం అందులో ఎన్టీఆర్ హోస్టింగ్ మాత్ర‌మే కాదు.. కంటెస్టెంట్లు కూడా. ఒక‌రు ఇద్ద‌రు కాదు.. చాలా మంది తెలిసిన వాళ్లే వ‌చ్చారు. ముమైత్ ఖాన్.. ధ‌న్ రాజ్.. శివ‌బాలాజీ.. న‌వ‌దీప్.. ఇలా చాలా మంది తెలిసిన మొహాలే వ‌చ్చారు.

కానీ సెకండ్ సీజ‌న్ లో మాత్రం పేర్లు చెప్పే వ‌ర‌కు కూడా తెలియ‌ని సెలెబ్రెటీస్ వ‌చ్చారు. ఒక్క తేజ‌స్వి త‌ప్పితే ఎవ‌రూ అందులో పెద్ద‌గా తెలిసిన మొహాలు క‌నిపించ‌డం లేదు. ఉన్న వాళ్ల‌లో గీతామాధురి.. త‌నీష్.. బాబు గోగినేని కాస్త బెట‌ర్. మిగిలిన వాళ్లైతే క‌చ్చితంగా పేర్లు చూడాల్సిందే. ఈ సారి సామాన్యులు అంటూ మ‌రో ముగ్గుర్ని తీసుకొచ్చారు. వాళ్లు సెలెబ్రెటీస్ అయ్యేదేమో కానీ షో అయితే సెలెబ్రెటీ షో నుంచి నార్మ‌ల్ షోగా మారిపోయింది. బిగ్ బాస్ తొలి సీజ‌న్ తో పోలిస్తే రెండో షో తొలి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మ‌రి దీన్ని హిట్ దిశ‌గా నాని ఎలా న‌డిపిస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here