బిగ్ బాస్ మిస్.. ఐపిఎల్ ఎస్.. 

Jr NTR
అక్క‌డో ప్రాణం పోయింది.. ఇక్క‌డో ప్రాణం పోసింది.. దేవుడు బ్యాలెన్సింగ్ చేస్తాడ్రా ప్ర‌పంచ‌కాన్నిఅంటూ అప్ప‌ట్లో ఓ సినిమాలో పాపుల‌ర్ డైలాగ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎన్టీఆర్ ప‌క్కాగా ఫాలో అవుతున్నాడు. ఈయ‌న చేతుల్లోంచి బిగ్ బాస్ జారిపోయింది. పోయింది అనుకంటే వ‌దిలేసాడు అనాలేమో..? ఎందుకంటే వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉండి బిగ్ బాస్ సీజ‌న్ 2 నుంచి బ‌య‌టికి వ‌చ్చేసాడు యంగ్ టైగ‌ర్. ఈయ‌న స్థానంలోకి ఇప్పుడు నాని వ‌చ్చాడు. ఇప్ప‌టికే సీజ‌న్ 2 కోసం పార్టిసిపెంట్స్ ఎంపిక జ‌రుగుతుంది. శ్రీ‌రెడ్డి ఇందులో సెలెక్ట్ అయింది కూడా. ఇక బిగ్ బాస్ 2ను వ‌దిలేసినా కూడా ఇప్పుడు మ‌రో కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు ఎన్టీఆర్. అదే ఐపిఎల్ బ్రాండ్ అంబాసిడ‌ర్. అవును.. ఇప్పుడు ఐపిఎల్ స్టార్ గ్రూప్ చేతుల్లోకి వ‌చ్చేసింది. దాంతో వాళ్లు తెలుగులోనూ ఐపిఎల్ ను తీసుకొస్తున్నారు. తెలుగు వ‌ర్ష‌న్ కు ఎన్టీఆర్ ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా తీసుకుంటున్నారు. ఐపిఎల్ ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చెంత చేర్చ‌డానికి బాధ్య‌త ఎన్టీఆర్ తీసుకున్నాడు. ఎప్రిల్ 7 నుంచి మొద‌ల‌య్యే ఈ టోర్న‌మెంట్ 45 రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. అన్నిరోజులు కూడా ఎన్టీఆర్ యాడ్స్ ను ప్రేక్ష‌కులు చూడొచ్చు. మొత్తానికి బిగ్ బాస్ మిస్ అయినా.. ఐపిఎల్ కు మాత్రం ఎస్ అన్నాడు జూనియ‌ర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here