బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఎవరో..?

BIG-BOSS-RE-ENTRY-NUTAN-naidu-and-bhanusri
వారం వారం ఆసక్తి పెంచేస్తుంది బిగ్ బాస్. ఈ వారం అయితే మరింత ఆసక్తిగా వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇన్ని వారాలు ఆదివారం వస్తే ఎవరు బయటికి వెళ్లిపోతారా అని చూసే వాళ్లంతా ఈ వారం మాత్రం ఎవరు లోనికి వస్తారా అని చూస్తున్నారు. బిగ్ బాస్ పై ఉన్న క్రేజ్ పెంచడానికి ఏదేదో చేస్తున్నారు నిర్వాహకులు. తమ చేతిలో ఉన్న అన్ని అస్త్రాలను వాడేస్తున్నారు.
ఇక ఇప్పుడు కొత్తగా బయటికి వెళ్ళిన వాళ్లనే మళ్లీ లోనికి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు సంజన.. నూతన్ నాయుడు.. కిరీటి.. శ్యామల.. భాను శ్రీ.. తేజస్వి బిగ్ బాస్ 2 నుంచి బయటికి వచ్చారు. వీళ్లలో ఎవరో ఒకరు ఈ వారం మళ్లీ లోనికి వెళ్లబోతున్నారు. అది ఎవరు అనే ఆసక్తి ఇప్పుడు అందర్లోనూ కనిపిస్తుంది.
ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే కచ్చితంగా నూతన్ నాయుడు లేదంటే భానుల్లో ఒకరు లోనికి మళ్లీ వెళ్లబోతున్నారని తెలుస్తుంది. ముందు ఈ అవకాశం తేజుకే ప్లస్ అవుతుందని అనుకున్నారంతా కానీ ఇప్పుడు ఓట్లు పడుతున్న తీరు చూస్తుంటే మాత్రం నూతన్ లేదంటే భానుకు బాగా ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది.
నూతన్ వస్తే కచ్చితంగా కౌశల్ కు సపోర్ట్ ఉంటుంది.. పైగా ఇప్పుడు ఇంట్లో కూడా కౌశల్ వన్ మెన్ ఆర్మీలా మారిపోయాడు. దాంతో నూతన్ వస్తే కాంట్రవర్సీలు పెరిగి షోకు ఇంకాస్త రేటింగ్ వస్తుందని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి చూడాలిక.. ఈ వారం బయటికి కాకుండా లోనికి వచ్చే ఆ కంటెస్టెంట్ ఎవరో..? వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here