బిగ్ బాస్ లో కామ‌న‌ర్ కేక పెట్టిస్తున్నాడు..


డోంట్ అండ‌ర్ ఎస్టిమేట్ ది ప‌వ‌ర్ ఆఫ్ ఏ కామ‌న్ మ్యాన్ అని చెన్నై ఎక్స్ ప్రెస్ లో షారుక్ ఖాన్ చెప్పిన డైలాగ్ గుర్తుందా..? ఇప్పుడు బిగ్ బాస్ 2లో గ‌ణేష్ ను చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. తొలి మూడు వారాలు ఏదో అలా అలా క‌నిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాడు. ఇప్పుడు ఈయ‌న్ని నామినేట్ చేయాలంటే కంటెస్టెంట్ల‌కు కార‌ణాలు కూడా దొర‌క‌డం లేదు. ఇన్నాళ్లూ ప్రెజ‌ర్ త‌ట్టుకోవ‌డం లేదు.. చిన్న పిల్లాడంటూ సోది క‌బుర్లు అన్ని చెప్పారు అంతా. కానీ నాని వార్నింగ్ తో అంతా సైలెంట్ అయిపోయారు.
నాలుగో వారం కూడా నామినేట్ అయి.. మ‌ళ్లీ బ‌తికి బ‌య‌ట‌పడ్డాడు గ‌ణేష్. ఈ కుర్రాడి తీరు చూస్తుంటే మ‌రో మూడు నాలుగు వారాల పాటు హౌజ్ లోనే తిష్ట వేసేలా క‌నిపిస్తున్నాడు. పైగా నాని స‌పోర్ట్ కూడా ఈ కుర్రాడికి అద‌న‌పు బ‌లం. అన్నింటికీ తోడు కామ‌న్ మ్యాన్ క‌దా.. ఇప్ప‌టికే ఉన్న ఇద్ద‌రు కామ‌న‌ర్స్ సంజ‌న‌, నూత‌న్ బ‌య‌టికి వ‌చ్చారు. దాంతో ఇప్పుడు గ‌ణేష్ ను కూడా ఎలిమినేట్ చేస్తే రాజ‌కీయం జ‌రిగింద‌ని షోకు కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దాంతో గ‌ణేష్ వారంవారం ఇంకా స్ట్రాంగ్ గా మారిపోతున్నాడు. మ‌రి ఈ కుర్రాడి ప్ర‌యాణం ఆ ఇంట్లో ఎంత దూరం ఉండబోతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here