బ‌న్నీకి బాగానే దెబ్బ ప‌డిందిగా..


మెగా ఫ్యామిలీలో చిరంజీవి త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని అంద‌రికీ తెలుసు. కానీ ప‌వ‌న్ త‌ర్వాత ఎవ‌రు అంటే మాత్రం ముందుగా రామ్ చ‌ర‌ణ్ పేరు వినిపించేది.. కానీ ఆ త‌ర్వాత ఈయ‌న చేసిన కొన్ని సినిమాలు ఆయ‌న ఇమేజ్ ను బాగా దెబ్బ‌తీసాయి. మార్కెట్ ఉన్నా కూడా స‌రైన సినిమాలేక వెన‌క‌బ‌డిపోయాడు చ‌ర‌ణ్.
అదే స‌మ‌యంలో బ‌న్నీ దూకుడు పెంచాడు. రేస్ లోకి దూసుకొచ్చాడు. ఒక‌టి రెండు అంటూ వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుని టాప్ లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈయ‌న ఇమేజ్ 70 కోట్ల వ‌ర‌కు ఉంది. ఇదే స‌మ‌యంలో చ‌ర‌ణ్ మాత్రం 50 కోట్ల‌లోనే ఉండిపోయాడు మ‌గ‌ధీర‌తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఆ స్థాయి హిట్ లేక‌.. న‌టుడిగానూ వెన‌క‌బ‌డి చ‌ర‌ణ్ కెరీర్ చాలా ఏళ్లుగా స‌రైన స్థితిలో లేదు. దాంతో ప‌వ‌న్ త‌ర్వాత బ‌న్నీనే అని అంతా ఫిక్స్ అయిపోయారు. దానికితోడు మెగా ఫ్యామిలీతో ఈ మ‌ధ్య బ‌న్నీకి పెద్ద‌గా ప‌డటం లేదనే వార్త‌లు వినిపిస్తున్నాయి.
ప‌వ‌న్ పై ఈయ‌న చేసిన చెప్ప‌ను బ్ర‌ద‌ర్ క‌మెంట్ కూడా బ‌న్నీ ఇమేజ్ ను కాస్త త‌గ్గించాయి. ఇలాంటి టైమ్ లో చ‌ర‌ణ్ కు కానీ ఒక్క భారీ హిట్ ప‌డితే బ‌న్నీ ప‌ని అంతే అనుకుంటున్నారు అభిమానులు. వాళ్ల ఆవేద‌న‌ను.. కోరిక‌ను దేవుడు అర్థం చేసుకున్న‌ట్లున్నాడు. అందుకే రంగ‌స్థ‌లం రూపంలో చ‌ర‌ణ్ కు ఊహించ‌ని బ‌హుమ‌తి ఇచ్చాడు.
ఈ చిత్రం విజ‌యం సాధిస్తే చాలు అనుకుంటే ఇప్పుడు ఏకంగా రికార్డుల దుమ్ము దులిపేస్తుంది. దాంతో చ‌ర‌ణ్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. కేవ‌లం విజ‌యం సాధించ‌డం కాదు.. చ‌ర‌ణ్ కు న‌టుడిగా ఎన్నో మార్కులు వేసింది ఈ చిత్రం. ఇప్ప‌ట్నుంచీ చ‌ర‌ణ్ ను ఎవ‌రైనా న‌టుడు కాదంటే రంగ‌స్థ‌లం చూపిస్తే స‌రిపోతుందేమో..? ఈ టైమ్ లో కానీ బ‌న్నీకి ఒక్క ఫ్లాప్ కానీ ప‌డితే దెబ్బ‌కు మ‌ళ్లీ చ‌ర‌ణ్ రేస్ లోకి రావ‌డం ఖాయం. అస‌లే మ‌నోడి ఖాతాలో ఇప్పుడు బోయ‌పాటి.. రాజ‌మౌళి.. కొర‌టాల‌.. సందీప్ రెడ్డి లాంటి ద‌ర్శ‌కులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here