బ‌న్నీ గారు.. స‌భ్య స‌మాజానికి ఇదేం మెసేజ్..?


డిజే సినిమాలో మాట్లాడితే ఇలా చేస్తూ స‌భ్య స‌మాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ డైలాగులు చెప్పాడు అల్లుఅర్జున్. ఇప్పుడు ఈయ‌న నా పేరు సూర్య సినిమ‌లో న‌టిస్తున్నాడు. ఇందులో సైనికుడిగా న‌టిస్తున్నాడు బ‌న్నీ. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే షూటింగ్ చివరిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్ర ఫ‌స్ట్ ఇంపాక్ట్ ఇప్ప‌టికే అదిరిపోయింది. అందులో ఓ సైనికుడు ఎలా ఉండాలో అలాగే ఉంటూ అద‌ర‌హో అనిపించాడు బ‌న్నీ. నిజంగానే ఓ సైనికుడిగా క‌ష్ట‌ప‌డ్డాడు. ఈయ‌న క‌ష్టాన్ని చూసి అంతా వావ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అల్లుఅర్జున్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో బ‌న్నీని చూసి కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. బాధ్య‌త గ‌ల సైనికుడిగా న‌టిస్తూ నోట్లో చుట్ట ఏంటండీ అంటున్నారు. నోట్లో చుట్ట పీలుస్తూ సైనికుడిగా ఉండి ఈ దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ అంటూ బ‌న్నీపై రివ‌ర్స్ సెటైర్లు వేస్తున్నారు నెటిజ‌న్లు.
నా పేరు సూర్య‌కు సంబంధించిన ఏదైనా ఇంపాక్ట్ అంటున్నాడు వ‌క్కంతం వంశీ. అలా అన‌డానికి కూడా కార‌ణం కూడా ఉంది. ప్ర‌తీది ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో బ‌లంగా ప‌డాల‌ని కోరుకుంటున్నాడు బ‌న్నీ. అందుకే ఇంపాక్ట్ అంటున్నాడు. కొడితే అలాగే మైండ్ లో ఫిక్సైపోవాల‌నేలా ఫ‌స్ట్ ఇంపాక్ట్ ఉంది. ప్ర‌భావం గ‌ట్టిగా ప‌డుతుంది కాబ‌ట్టే ఫ‌స్ట్ ఇంపాక్ట్ అని పెట్టాడు వ‌క్కంతం వంశీ. ఇందులో మ‌రో అర్జున్ రెడ్డిగా ఉన్నాడు బ‌న్నీ. కోపం ప‌ట్ట‌లేనంత ఉంటుంది ఈ పాత్ర‌కు. ఇలాంటి వాడు సైనికుడు అయితే ఎలా ఉంటుంద‌నేది క‌థ‌. రెగ్యుల‌ర్ గా బ‌న్నీ సినిమాల్లో చూసే కామెడీ.. డాన్సులు ఈ చిత్రంలో క‌నిపించ‌వు. టీజ‌ర్ చూస్తుంటేనే ఈ విష‌యం అర్థ‌మైపోతుంది. ప‌క్కా సీరియ‌స్ స్టోరీ ఇది.. పైగా నెరేష‌న్ కూడా ఇలాగే ఉంటుంద‌ని ఇంపాక్ట్ తోనే చూపించాడు ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ. నా పేరు సూర్య మే 4న విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. చుట్ట‌తో బ‌న్నీ ఏం మెసేజ్ ఇస్తున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here