భ‌ర‌త్ అదిరిపోయాడంటున్నారుగా..


మ‌హేశ్ బాబు సినిమాల‌కు పాజిటివ్ టాక్ రావ‌డ‌మే ఆల‌స్యం.. వ‌స్తే రికార్డులే రికార్డులు. కానీ ముందు టెస్ట్ పాస్ అవ్వాలి క‌దా..! అది జ‌ర‌గ‌డ‌మే క‌ష్టం. ఇప్పుడు ఈయ‌న భ‌ర‌త్ అనే నేనుతో వ‌స్తున్నాడు. తాజాగా ఈ చిత్ర సెన్సార్ పూర్త‌యింది.
టాక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. మొన్నీమ‌ధ్యే రంగ‌స్థ‌లం చూసి స్టాండింగ్ ఒవేష‌న్ ఇవ్వ‌డ‌మే కాకుండా ప్ర‌త్యేకంగా టీం ను అభినందించారు. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను చూసి ఇవే ప్ర‌శంస‌లు వ‌చ్చాయ‌ని తెలుస్తుంది.
ఇప్పుడున్న ప‌రిస్థితుల‌కు ఇలాంటి సినిమా ఒక‌టి క‌చ్చితంగా అవ‌స‌రం అని సెన్సార్ సభ్యులు కొర‌టాల‌ను ఆకాశానికి ఎత్తేసారు. ఈ సినిమా మొద‌ల‌వ్వ‌డం కాస్త స్లోగా ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌హేశ్ విదేశాల్లో ఉండ‌టం.. తండ్రి చ‌నిపోయిన త‌ర్వాత ఇండియాకు రావ‌డం.. రాజ‌కీయాలు.. ఇక్క‌డి పాలిటిక్స్ అర్థం చేసుకోవ‌డం..
ఇవ‌న్నీ కాస్త టైమ్ తీసుకున్నా ఒక్క‌సారి ఆయ‌న చేతికి సిఎం ప‌గ్గాలు వ‌చ్చిన త‌ర్వాత సినిమా ఎక్క‌డా ఆగ‌కుండా వెళ్లింద‌ని తెలుస్తుంది. క్లైమాక్స్ వ‌ర‌కు కుమ్మేసాడ‌ని.. ఈ చిత్రంతో మ‌రోసారి మ‌హేశ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయ‌మంటున్నారు విశ్లేష‌కులు. పైగా ఈ చిత్రం విడుద‌ల‌వుతున్న తీరు కూడా సంచ‌ల‌న‌మే. పాజిటివ్ టాక్ కానీ వ‌స్తే నాన్ బాహుబ‌లిలో ఏ ఒక్క రికార్డు కూడా మిగ‌ల‌దు. అది మాత్రం ప‌క్కా. చూడాలిక‌.. మ‌హేశ్ ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here