భ‌ర‌త్ అనే నేను.. బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తున్నాను..

Bharat Ane Nenu
ఇప్పుడు ప్రీమియ‌ర్స్ అయిపోయిన త‌ర్వాత యుఎస్ నుంచి వ‌చ్చిన రిపోర్ట్స్ ఇవే మ‌రి. మ‌హేశ్ మ‌రోసారి ఫామ్ లోకి రావ‌డ‌మే కాదు.. క‌చ్చితంగా ఇంకోసారి ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డానికి రెడీ అవుతున్నాడు. భ‌ర‌త్ అనే నేనుకు టాక్ సూప‌ర్ పాజిటివ్ గా వ‌చ్చేసింది. ఈ మ‌ధ్య కాలంలో రంగ‌స్థ‌లంతో ఇండ‌స్ట్రీ రేంజ్ ఏంటో తెలిసింది..
ఇప్పుడు భ‌ర‌త్ దాన్ని నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్ల‌డానికి రెడీ అయింది. సినిమాలో చాలా సీన్స్ ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా క‌నెక్ట్ అవుతాయ‌ని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంట‌ర్వెల్ సీన్ అయితే రోమాలు నిక్క‌బొడుచుకునేలా కొర‌టాల డిజైన్ చేసాడ‌ని.. ఇక సెకండాఫ్ లో అసెంబ్లీ సీన్ తో పాటు మ‌రికొన్ని సీన్స్ కూడా అద్భుతంగా రాసుకున్నాడ‌ని చెబుతున్నారు యుఎస్ ప్రేక్ష‌కులు.
ఈ సినిమాతో మ‌హేశ్ మ‌రోసారి శ్రీ‌మంతుడు దాటి రికార్డులు సృష్టించ‌డం ఖాయ‌మైపోయింది. ఇప్పుడు అంద‌రి దృష్టి ఒక్క‌టే ఈ సినిమా మ్యాగ్జిమ‌మ్ రేంజ్ ఏంటి అని..? చూడాలిక‌.. భ‌ర‌త్ తో మ‌హేశ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here