మనం సైతం టీషర్టు ఆవిష్కరించిన తమన్నా….


నిస్సహాయులకు అండగా నిలుస్తున్న మనం సైతం సంస్థ కార్యక్రమాలను ప్రముఖ నాయిక తమన్నా అభినందించారు. మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ను ప్రశంసించారు. ఈ సేవా సంస్థకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆమె తెలిపారు. మనం సైతం టీషర్టును ఆవిష్కరించిన తమన్నా…
పరిశ్రమలో అండ లేని వాళ్లను ఆదుకునేందుకు మనం సైతం లాంటి సంస్థను ప్రారంభించడం, వందలాది మందికి సహాయం అందించడం గొప్ప విషయమన్నారు. తమన్నా మాట్లాడుతూ…మనం సైతం కార్యక్రమాల గురించి తెలుసుకున్నాను.
ఎంతో మంది పేదవాళ్లను ఆదుకుంటోంది మనం సైతం. ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో ఇకపై నేనూ భాగస్వామి అవుతాను. ఇండస్ట్రీలోని ఇరవై నాలుగు విభాగాల కార్మికులకు మనం సైతం అండగా నిలవడం సంతోషంగా ఉంది. కాదంబరి కిరణ్ అతని బృందానికి నా అభినందనలు. అన్నారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…..
మనం సైతం కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం. దీని వల్ల ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం వస్తుంది. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ మా మనం సైతం కార్యక్రమాలకు చేయూత ఇవ్వడం ఆనందంగా ఉంది. మా సంస్థలో భాగమవుతానని ఆమె చెప్పడం ఎంతో బలాన్నిచ్చింది. తమన్నా గారికి మనం సైతం సంస్థలోని ప్రతి ఒక్కరి తరుపునా కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here