మామతో కోడ‌లు పోటీ..


ఫ్యామిలీ వార్స్ కు ఇప్పుడు మంచి టైమ్ న‌డుస్తుంది. ఒకే కుటుంబం హీరోలు.. హీరోయిన్లు కూడా బాక్సాఫీస్ వార్ కు రెడీ అవుతున్నారు. ఇదే జ‌రుగుతుందిప్పుడు. అక్కినేని మామా కోడ‌ళ్లు బాక్సాఫీస్ పోరులో దిగుతున్నారు. జూన్ 1న నాగార్జున ఆఫీస‌ర్ విడుద‌లవుతుంది. పాతికేళ్ల గ్యాప్ త‌ర్వాత నాగార్జున‌తో వ‌ర్మ తెర‌కెక్కించిన సినిమా ఇది. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించాడు నాగ్. హీరోయిన్ ఉండ‌దు.. పూర్తిగా యాక్ష‌న్ డ్రామా ఈ ఆఫీస‌ర్. ఇక ఇదే రోజు స‌మంత అక్కినేని న‌టించిన అభిమ‌న్యుడు విడుద‌ల‌వుతుంది. విశాల్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. పేరుకు విశాల్ సినిమా అయినా తెలుగులో స‌మంత ఇమేజ్ ఈ చిత్రానికి చాలా హెల్ప్ అవుతుంది. దాంతో మామా కోడ‌ళ్ల మ‌ధ్య స‌మ‌రంగానే బాక్సాఫీస్ వార్ న‌డుస్తుంది. ఈ వార్ ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు. పెళ్లైన త‌ర్వాత కూడా వ‌ర‌స హిట్లు కొడుతూ దూసుకుపోతుంది స్యామ్. ఇదే వ‌ర‌స‌లో ఇప్పుడు అభిమ‌న్యుడు కూడా చేరిపోతుంద‌నే న‌మ్మ‌కంతో ఉంది అక్కినేని కోడ‌లు. చూడాలిక‌.. మామ‌తో పోరులో స‌మంత ఎలా యుద్ధం చేస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here