మామ‌ను పూర్తిగా దించేసావుగా సాయి.. 

Chamaku Chamaku Cham
మెగా మేన‌ల్లుడు మ‌హా మ‌దురు. పైకి క‌నిపించ‌డు కానీ లోప‌ల మాత్రం మామ‌య్య‌ల‌పై చాలా ప్రేమ ఉంది ఈ హీరోకు. అందుకేనేమో వ‌ద్ద‌న్నా కూడా ప్ర‌తీ సినిమాలోనూ క‌చ్చితంగా మావ‌య్య‌ల‌ను గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు ఇంటిలిజెంట్ లోనూ ఇదే ఫాలో అయ్యాడు ఈ కుర్ర హీరో. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు చిరంజీవిని కూడా దించేసాడు సుప్రీమ్ హీరో. ఛ‌మ‌క్ ఛ‌మ‌క్ ఛాం పాట‌లో అచ్చంగా 80ల్లో ఉండే చిరంజీవినే గుర్తు చేసాడు మెగా మేన‌ల్లుడు. అది కావాలని చేసాడో.. లేదంటే మేన‌రికంలో వ‌చ్చిన వ‌ర‌మో తెలియ‌దు మ‌రి. చూస్తుంటే మాత్రం క‌చ్చితంగా కావాల‌నే చేసిన‌ట్లుగా తెలిసిపోతుంది. ఛ‌మక్ ఛ‌మ‌క్ పాట క‌చ్చితంగా విజువ‌ల్ ట్రీట్ అవుతుంద‌న‌డంలో పెద్ద‌గా ఆశ్చ‌ర్యం అయితే లేదు. త‌న‌దైన శైలిలో డాన్సులు కుమ్మేసాడు సాయిధ‌రంతేజ్. ఇక లావ‌ణ్య కూడా అందాల‌తో ఆక‌ట్టుకుంది. సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాన్ ను కూడా వ‌ద‌ల్లేదు సాయిధ‌రం. ట్రైల‌ర్ లోనే బ‌ద్రిలోని ఏ చికితా గెట‌ప్ దించేసాడు సాయి. వినాయ‌క్ కావాల‌నే ఈ షాట్స్ తీసాన‌ని ప్రీ రిలీజ్ వేడుక‌లోనే చెప్పాడు. అంటే క‌చ్చితంగా మేన‌ల్లుడు మావ‌య్య‌ల‌ను ఇప్ప‌ట్లో వాడ‌కం ఆపేయ‌డ‌న్న‌మాట‌. అంతేలెండి.. ఎవ‌రెవ‌రో బ‌య‌టి వాళ్లే మెగా హీరోల‌ను వాడేస్తున్నారు. అలాంటిది సొంత మేన‌ల్లుడు ఎందుకు వాడుకోకుండా ఉంటాడు చెప్పండి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here