మినిపై ప్ర‌తీకారం తీర్చుకున్న సావిత్రి..


అదేంటి.. ఆ ప్ర‌తీకారం తీర్చుకోలేకే క‌దా.. త‌న జీవితాన్ని త‌నే నాశ‌నం చేసుకుంది. జెమినిపై కోపంతోనే క‌దా.. ఆమె కెరీర్ తో పాటు జీవితం కూడా ముగిసిపోయింది. ఇప్ఉప‌డు ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు సావిత్రి ప‌గ తీర్చుకుంది. అదెలా అంటారా..?
ఇప్పుడు సినిమాతో అది సాధ్య‌మైంది. అప్ప‌ట్లో సావిత్రి జీవితంలో విల‌న్ ఎవ‌రంటే జెమిని గ‌ణేష‌న్ అని అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు మ‌హాన‌టి సినిమాలో కూడా ఇదే చూపించాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రంలో మ‌హాన‌టిగా కీర్తి ఎంత బాగా న‌టించిందో.. ఆమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా దుల్క‌ర్ కూడా న‌టించాడు.
కానీ అంద‌రి చూపులు.. ప్ర‌శంస‌లు మాత్రం కీర్తిసురేష్ కే వెళ్లిపోతున్నాయి. నిజానికి దుల్క‌ర్ అద్భుతంగా న‌టించినా కూడా జెమినిపై ఉన్న కోపంతో ఆ పాత్ర‌ను త‌క్కువ చేస్తున్నారు. ఇదే నైతికంగా ఇప్పుడు సావిత్రి సాధించిన విజ‌యం. దుల్క‌ర్ స‌ల్మాన్ అద్భుత‌మైన న‌ట‌న కూడా జెమినిపై ఉన్న కోపం ముందు ఓడిపోయింది. అలా అప్పుడు త‌న లైఫ్ లో విల‌న్ గా మారిన జెమినీపై కోపాన్ని ఇప్పుడు ఇలా మ‌హాన‌టితో తీర్చుకుంది సావిత్రి.
రేపు అవార్డులు వ‌చ్చినా కూడా పూర్తిగా కీర్తిసురేష్ వైపు వెళ్తాయేమో కానీ అద్భుతంగా న‌టించిన దుల్క‌ర్ కు రావ‌డం మాత్రం అనుమానమే. ఎందుకంటే ఆ పాత్ర‌పై ప్రేక్ష‌కుల‌కు ఉన్న కోపం అది. జెమిని చ‌చ్చి బ‌తికిపోయాడు కానీ ఇప్పుడు కానీ బ‌తికి ఉండుంటే ప్రేక్ష‌కుల కోపానికి చ‌చ్చిపోయేవాడేమో మ‌రి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here