మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారో..?


ఇప్పుడు బ‌య‌ట జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే. తెలుగు ఇండ‌స్ట్రీ ఈ మ‌ధ్య కాలంలో ఎప్పుడూ ఇంక ఐక‌మ‌త్యంగా క‌నిపించ‌లేదు. ఇంత‌కాలం లోలోప‌ల గొడ‌వ‌ల‌తో పైకి మాత్రం న‌వ్వు న‌టించిన మనోళ్లంతా ఇప్పుడు నిజంగానే ఒక్క‌టైపోయారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎగ‌రేసిన తిరుగుబాటు జెండా ఇప్పుడు ఇండ‌స్ట్రీలో బాణ‌మై ఒక్కొక్క‌రికి గుచ్చుకుంటుంది. అందుకే అంతా ఒకే తాటిపైకి వ‌చ్చారు. ఈ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్..
రేపు మ‌నం.. అంత వ‌ర‌కు ఆగేది ఎందుకు ఇప్పుడే ఎదుర్కొందాం ప‌దా అంటూ అంతా ఒక్క‌మాట మీద‌కు వ‌స్తున్నారు. తాజాగా ఎప్పుడూ లేని విధంగా మ‌న ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా అన్నపూర్ణ స్టూడియోస్ సాక్షిగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. చిరంజీవి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ మీటింగ్ లో ఇండ‌స్ట్రీ మొత్తం క‌దిలొచ్చింది. సీని య‌ర్ హీరోల‌తో పాటు బ‌న్నీ, చ‌ర‌ణ్, రామ్, నాని లాంటి కుర్రాళ్లు కూడా వ‌చ్చారు.
ముఖ్యంగా మీడియా చేస్తోన్న ఓవ‌ర్ యాక్ష‌న్ పైనే ఈ మీటింగ్ లో ఎక్కువ‌గా చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తుంది. చిన్న విష‌యాల‌ను కూడా కావాల‌నే కొన్ని ఛానెల్స్ హైలైట్ చేస్తున్నాయ‌ని.. ఇండ‌స్ట్రీపై బుర‌ద జ‌ల్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని మాట్లాడిన‌ట్లు స‌మాచారం. అస‌లు న్యూస్ ఛానెల్స్ కు ఎంట‌ర్ టైన్మెంట్ కంటెంట్ ఇవ్వ‌కూడ‌ద‌ని.. వాళ్ల‌ను పూర్తిగా బాయ్ కాట్ చేయాల‌ని అల్లు అర‌వింద్ సూచించిన‌ట్లుగా తెలుస్తుంది.
అయితే దీనికి ఏ ఒక్కరు కూడా పూర్తిస్థాయిలో సంఘీభావం తెల‌ప‌లేదు. ఎందుకంటే ఎవ‌రో ఇద్దరు ముగ్గురు చేసిన ప‌నికి మీడియాను బ‌హిష్క‌రిస్తే.. బియ్యంలో రాళ్లున్నాయ‌ని బియ్యాన్ని పారబోసుకున్న‌ట్లే. అది వాళ్ల‌కు కూడా న‌ష్ట‌మే.
ఈ మీటింగ్ లో ఇంకా చాలా విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తుంది. ఇక‌పై న్యూస్ ఛానెల్స్ ఇండ‌స్ట్రీకి వ్య‌తిరేకంగా ఏదైనా డిబేట్లు పెడితే చాలా క‌ఠినంగా శిక్షలు తీసుకోవాల‌ని అంతా క‌లిసి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది.
ఇది మాత్రం ఇమ్మీడియట్ గా ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ప‌వ‌న్ ఎగ‌రేసిన ఈ తిరుగుబాటు బావుటా ఇప్పుడు మీడియాపై కూడా బాగానే ప‌ని చేస్తుంది. గ‌త వారం రోజులుగా ప‌వ‌న్ బ‌య‌టికి వ‌చ్చి మాట్లాడిన త‌ర్వాత ఆ స‌ద‌రు మూడు న్యూస్ ఛానెల్స్ లో ఎలాంటి చెత్త క‌నిపించ‌ట్లేదు. రాంబాబు దెబ్బ‌కు అంతామూసుకుని కూర్చున్నారు. మొత్తానికి ఇదే ఐక‌మ‌త్యం క‌నిపిస్తే త్వ‌ర‌లోనే మీడియా కూడా ఇండ‌స్ట్రీకి దోస్త్ గా మారిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here