ముందు ఎఫ్ 2.. ఆ త‌ర్వాతే అది..!

Varun Tej
ఇండ‌స్ట్రీలో ఎవ‌రి టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌లేం. ఏడాది కింది వ‌ర‌కు సాయిధ‌రంతేజ్ స్టార్ అవుతాడు.. వ‌రుణ్ తేజ్ మాత్రం రానాలా అన్ని పాత్ర‌లు చేసుకోవాల్సిందే అని జోస్యం చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. ఒక్క హిట్ అంటూ సాయి ఎదురుచూస్తుంటే.. వ‌రుణ్ తేజ్ మాత్రం వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకెళ్తున్నాడు. ఫిదా.. వెంట‌నే తొలిప్రేమ విజ‌యాలు సాధించ‌డంతో వ‌రుణ్ తేజ్ కెరీర్ ఇప్పుడు టాప్ స్పీడ్ లో ఉంది. మీడియం బ‌డ్జెట్ సినిమాల‌కు ఇప్పుడు వ‌రుణ్ తేజ్ ప‌ర్ ఫెక్ట్ ఛాయిస్ అయ్యాడు.
దాంతో నిర్మాత‌లు ఇత‌డి కోసం క్యూ క‌డుతున్నారు. ఈ క్యూలోనే ముందు ఏ నిర్మాత‌ను తీసుకురావాలో అర్థం కాక క‌న్ఫ్యూజ్ అవుతున్నాడు మెగా ప్రిన్స్. ఇప్ప‌టికే ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డితో ఓ సినిమా చేయ‌బోతున్నాడు వ‌రుణ్ తేజ్.
ఈ చిత్రాన్ని మే లో మొదలు పెట్టాల‌నుకున్నా ఇప్పుడు అది కుదిరేలా క‌నిపించ‌ట్లేదు. స్పేస్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే సినిమా కాబ‌ట్టి ఆ మ‌ధ్య క‌జ‌కిస్థాన్ వెళ్లి జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకున్నాడు వ‌రుణ్ తేజ్. రాజ‌వ్ రెడ్డి..
సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. వ‌రుణ్ తేజ్ కు జోడీగా లావ‌ణ్య త్రిపాఠి.. అదితిరావ్ హైద్రీ న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. షూటింగ్ ఎప్పుడు అంటే కూడా వ‌రుణ్ సైలెన్స్ స‌మాధానంగా మారింది. ఇదిలా ఉంటే ఎఫ్ 2 జూన్ లో మొద‌లు కానుంది. ఈ మేర‌కు అఫీషియ‌ల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు నిర్మాత దిల్ రాజు. అనిల్ రావిపూడి తెర‌కెక్కించ బోయే ఈ చిత్రంలో వెంక‌టేశ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో సంక‌ల్ప్ సినిమా కూడా మొద‌లైతే..
రెండింట్లో వ‌రుణ్ తేజ్ కు పెద్ద క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప‌దు. దిల్ రాజు కాబ‌ట్టి ముందు ఎఫ్ 2 వైపు వెళ్లేలా క‌నిపిస్తున్నాడు. పైగా సంకల్ప్ సినిమా గ్రాఫిక్స్ ఎక్కువ‌గా ఉంటుంది. దాంతో ఆ సినిమాను నెమ్మ‌దిగా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు. మొత్తానికి ఈ కుర్రాడి క‌న్ఫ్యూజ‌న్ పోవాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here