మెగాస్టార్ వైపు వీస్తున్న ప‌వ‌నాలు..


ఇప్పుడు ఇదే అనిపిస్తుంది మ‌రి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇన్నాళ్లూ మెగా ఫ్యామిలీలో ఓ హీరో.. కాద‌నే వాళ్లు లేరు. అన్నాద‌మ్ముల మ‌ధ్య ఎలాంటి విభేధాలు కూడా లేవు. ఇది కూడా నిజ‌మే. కానీ ద‌గ్గ‌రుండేవాళ్లు మాత్రం కాదు. ఇది క‌చ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే లోలోప‌ల వాళ్లెప్పుడూ క‌లిసినా..
బ‌య‌టికి మాత్రం ఏడాదికో రెండేళ్ల‌కో అన్నాద‌మ్ములు ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించేవాళ్లు. కానీ ఈ మ‌ధ్య సీన్ మారిపోతుంది. ఎందుకో తెలియ‌దు కానీ అన్న గూటికి చేరిపోతున్నాడు ప‌వ‌ర్ స్టార్. మాట్లాడితే చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి క‌నిపిస్తున్నాడు. మొన్న‌టికి మొన్న చెర్రీ బ‌ర్త్ డేకు అన్న‌య్య ఇంటికి వ‌చ్చి అబ్బాయిని దీవించి వెళ్లాడు. ఇక త‌న పుట్టిన‌రోజుకు అప్ప‌ట్లో అన్న‌య్య‌తోనే తొలి ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఇక మొన్న కూడా చ‌ర‌ణ్ తోనే క‌లిసి త‌న కుమారుడు అకీరా బ‌ర్త్ డేకు వెళ్లాడు. ఇప్పుడు అన్నింటికి మించి రంగ‌స్థ‌లం ప్ర‌త్యేకంగా ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో చూడ‌టం కాకుండా.. స‌క్సెస్ మీట్ కు కూడా వ‌స్తున్నాడు. హైద‌రాబాద్ లోనే ఎప్రిల్ 12న ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. దీనికి ప‌వ‌న్ చీఫ్ గెస్ట్ గా వ‌స్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈ ప‌వ‌నాల‌న్నీ మెగాస్టార్ వైపుగా వీస్తున్నాయి. ఇది దేనికి సంకేత‌మో మ‌రి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here