మెడిక‌ల్ మాఫియాలో ఇరుక్కున్న సాయి..


మెగా మేన‌ల్లుడికి హిట్లు రావ‌డం లేదు కానీ అవ‌కాశాలు మాత్రం బాగానే వ‌స్తున్నాయి. ఈయ‌న‌కు వ‌ర‌స‌గా సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడు మ‌రో సినిమా కూడా వ‌చ్చేసింది. తాజాగా తేజ్ ఐ ల‌వ్ యూ సినిమా చేస్తున్నాడు సాయిధరంతేజ్. క‌రుణాక‌ర‌ణ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. జూన్ 29న విడుద‌ల కానుంది తేజ్. ఇక ఈ చిత్రం ఇలా పూర్త‌యిందో లేదో అప్పుడే మ‌రో రెండు సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసాడు ఈ హీరో.
నేనుశైల‌జ‌.. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ లాంటి సెన్సిబుల్ సినిమాలు చేసిన కిషోర్ తిరుమ‌ల‌తో సాయి ఓ సినిమా చేస్తున్నాడు. ఇక దాంతో పాటే గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు ఈ హీరో. ఇదివ‌ర‌కే ఈ కాంబినేష‌న్ లో విన్న‌ర్ వ‌చ్చింది కానీ గెల‌వ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఈ జోడీ సినిమా చేస్తున్నారు. ఈ సారి మెడిక‌ల్ మాఫియాపై ప‌డుతున్నారు సాయి..
గోపీచంద్ మ‌లినేని. మెడిక‌ల్ సిస్ట‌మ్ లో జ‌రిగే అన్యాయాల్ని హైలైట్ చేస్తూ ఈ క‌థ సిద్ధం చేస్తున్నాడు గోపీచంద్ మ‌లినేని. త్వ‌ర‌లోనే సినిమా మొద‌లు కానుంది. వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. మ‌రి జ‌వాన్ తో ఓ సారి సందేశాలు ఇవ్వ‌బోయి దెబ్బ‌తిన్న సాయి.. ఈ సారి ఏం చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here