మెహ్రీన్ పిర్జాద కు ఫోన్ లు చేస్తున్న టాప్ డైరెక్టర్

Mehreen Pirzada In NTR - Trivikram Film
మెహ్రీన్ పిర్జాద, వరుస విజయాలతో ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న హీరోయిన్. మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలు సక్సెస్ అవ్వడంతో ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. త్వరలో రిలీజ్ కాబోతున్న జవాన్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. చిత్రంలోని ‘బుగ్గనచుక్క’ అనే పాట నెట్ లో హల్చల్ చేస్తుంది.
ఈ పాటలో సాయి ధరమ్ తేజ్ తో హాట్ హాట్ గా రొమాన్స్ చేసింది మెహ్రీన్. కాగా ఈ పంజాబీ భామ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారట. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ మెహ్రీన్ కు స్వయంగా ఫోన్ చేసి తన చిత్రం లో చెయ్యాలని కోరాడట. ఎన్టీఆర్ సరసన ఆమెను బుక్ చెయ్యాలని నిశ్చయంచికున్నారట. అను ఇమ్మానుయేల్, పూజ హెగ్డే వంటి హీరోయిన్ ల పేరులు పరిశీలనా లోకి వచ్చినా, దూకుడు మీద ఉన్న మెహ్రీన్ ఈ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకొనే అవకాశం ఎక్కువుందని ఫిలిం నగర్ వార్త.