ఎఫ్ 3 సినిమా నిజంగానే ఉంటుందా…

సంక్రాంతి సినిమాల్లో f2 సంచలన విజయం సాధించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ తెరకెక్కించిన ఈ చిత్రం 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఇప్పటికే. ఈ చిత్రం చూస్తుంటే 60 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చేలా కనిపిస్తుంది. గతేడాది దిల్ రాజుకు వచ్చిన నష్టాలన్నీ అన్నీ ఈ ఒక్క సినిమానే భర్తీ చేస్తుంది. విడుదలైన ఆరు రోజుల తర్వాత కూడా ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డు తో కలకలలాడుతోంది ఎఫ్2 సినిమా. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

F2 Success Meet Photos (23)

వెంకటేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కావలసినంత కామెడీ ఉండటం.. కుటుంబ ప్రేక్షకులకు చేరువ కావడంతో దమ్ము దులిపేస్తుంది ఈ చిత్రం. ఈ చిత్ర విజయంలో అందరి పాత్ర ఉన్న కూడా అందరి కంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు అనిల్ రావిపూడి గురించి. f2 ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు f3 కథ సిద్ధం చేస్తున్నాడు ఈ దర్శకుడు. తాజాగా సక్సెస్ మీట్ లో ఈ సినిమా గురించి వివరాలు చెప్పారు. ఎఫ్2 సినిమాతోనే నవ్వి నవ్వి చచ్చిపోతే ఎఫ్ 3 సినిమా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అంటే వరుణ్ తేజ్ ఒక పజిల్ కూడా వదిలాడు. త్వరలోనే ఈ సీక్వెల్ పై క్లారిటీ రానుంది. దీన్ని కూడా దిల్ రాజు నిర్మిస్తానని చెబుతున్నాడు. మొత్తానికి మరి వరుణ్ తేజ్, వెంకీ మరోసారి కలిసి నటిస్తే ఎలా ఉండబోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here