మెహ‌ర్ ర‌మేష్ అక్క‌డ ఫిక్సైన‌ట్లున్నాడుగా..!

ఎవ‌రి పేరు చెబితే నిర్మాత‌లు భ‌య‌ప‌డ‌తారో.. ఎవ‌రి పేరు చెబితే హీరోలు టెన్ష‌న్ ప‌డ‌తారో ఆయ‌నే మెహర్ ర‌మేష్. సూప‌ర్ స్టార్స్ తో సినిమాలు  చేసి కూడా పాపం డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్ గా మిగిలిపోయాడు మెహ‌ర్ ర‌మేష్. ఈయ‌న పేరు చెబితేనే హీరోలు కంగారు ప‌డే స్థాయికి వ‌చ్చేసింది ఇత‌గాడి ఇమేజ్. మెహ‌ర్ ర‌మేష్ తీసింది నాలుగు సినిమాలు.. అన్నీ ఫ్లాపులే.. నిర్మాతల జేబుల‌కు చిల్లులు పెట్టిన‌వే.. కంత్రితో ఎంట్రీ ఇచ్చిన ఈ ద‌ర్శకుడు.. తొలి సినిమాతో ప‌ర్లేద‌నిపించుకున్నాడు.. ఆ వెంట‌నే ప్రభాస్ తో బిల్లా చేసి జ‌స్ట్ ఓకే అనిపించాడు.. ఇక ముచ్చట‌గా ఈ ద‌ర్శకుడి నుంచి వ‌చ్చిన మూడో సినిమా శ‌క్తి.. ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన ఈ సినిమా అటు నిర్మాత అశ్వినిద‌త్ ను ఇటు హీరో ఎన్టీఆర్ ను పూర్తిగా ముంచేసింది.. శ‌క్తితో మెహ‌ర్ ఇచ్చిన డోస్ కు మ‌నోడి వైపు వెళ్లడానికే హీరోలంతా భ‌య‌ప‌డ్డారు. ఇక షాడో సినిమా గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ సినిమా వ‌చ్చి ఐదేళ్లు దాటినా ఇప్ప‌టి వ‌ర‌కు మెహ‌ర్ ర‌మేష్ కు మ‌రో అవ‌కాశం ఇచ్చే ధైర్యం ఏ హీరో చేయ‌లేదు.
ఇప్పుడు మెహ‌ర్ ర‌మేష్ ఏం చేస్తున్నాడు..? ఎక్క‌డున్నాడు..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం దొరుకుతుంది. మెహ‌ర్ ప్ర‌స్తుతం సినిమాల‌పై పూర్తిగా ఆశ‌లు వ‌దిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు. అయితే మ‌నోడు సినిమాలు తీయ‌డంలో ఫెయిలైనా.. స్టైలిష్ మేక‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇదే ఇప్పుడు ఈయ‌న‌కు వ‌రంగా మారింది. యాడ్స్ చేసుకుంటూ ప్ర‌స్తుతానికి కాలం గ‌డిపేస్తున్నాడు మెహ‌ర్. దీనికి తోడు మెగా కుటుంబానికి బంధువు కావ‌డంతో వాళ్ల సినిమాల‌కు అసిస్టెంట్ గా ప‌ని చేస్తున్నాడు మెహ‌ర్ ర‌మేష్. తాజాగా ఇంటిలిజెంట్ ప్రీ రిలీజ్ వేడుక‌లోనూ సాయిధ‌రంతేజ్ తోనే క‌నిపించాడు మెహ‌ర్. మొత్తానికి ద‌ర్శ‌క‌త్వానికి దూరంగా ఉంటూ.. అసిస్టెంట్ డైరెక్ష‌న్ తోనే కాలం గ‌డిపేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here