మ‌ణిర‌త్నం న‌వాబ్ వ‌స్తున్నాడు..!

MANIRATNAM MOVIE NAWAAB
న‌వాబ్ అంటే లీడ‌ర్ అని అర్థం. ప‌దిమందికి నాయ‌కుడు అని అర్థం. ఇప్పుడు ఇలాంటి టైటిల్ తో వ‌స్తున్నాడు మ‌ణిర‌త్నం. ఈయ‌న తాజా సినిమా న‌వాబ్ షూటింగ్ పూర్త‌యింది. ఈ సినిమాను కేవ‌లం మూడు నెలల్లోనే పూర్తి చేస్తాన‌ని అప్ప‌ట్లో చెప్పాడు మ‌ణిర‌త్నం. అన్నీ కుదిరుంటే క‌చ్చితంగా పూర్తి చేసేవాడేనేమో కానీ ఏం చేస్తాం.. శింబు వివాదాల్లో ఇరుక్కున్నాడు.. విజ‌య్ సేతుప‌తి ఇతర సినిమాల‌తో బిజీగా ఉన్నాడు..
అర‌వింద్ స్వామి కూడా ఇప్పుడు బిజీ అయిపోయాడు. దాంతో డేట్స్ క్లాష్ రావ‌డంతో ఈ చిత్రం మూడు నుంచి ఏడు నెల‌లు అయింది. అబుదాబిలో ఎక్కువ భాగం షూటింగ్ చేసాడు మ‌ణిర‌త్నం. న్యూ క్లియ‌ర్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక సెర్బియాలో చివ‌రి షెడ్యూల్ ను పూర్తి చేసాడు. జ్యోతిక‌, అదితిరావ్ హైద్రీ, ధ‌న్య ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సెప్టెంబ‌ర్ లో సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.
చెలియా ఫ్లాప్ త‌ర్వాత ఈ సినిమా చేసాడు మ‌ణి. భారీ బ‌డ్జెట్ తో త‌నే నిర్మిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం.. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ ఈ చిత్రానికి బోన‌స్. మ‌రి ఈ చిత్రంతో అయినా మ‌ణిర‌త్నం హిట్ కొడ‌తాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here