మ‌నం పొమ్మ‌న్నాం.. వాళ్లు ర‌మ్మ‌న్నారు..!

SAYESHA-SAIGAL-IN-TAMIL

అదేం విచిత్ర‌మో కానీ మ‌నం కాద‌నుకున్న హీరోయిన్ల‌ను తీసుకెళ్లి అర‌వోళ్లు అంద‌లం ఎక్కిస్తారు. ఇదివ‌ర‌కు చాలా మంది విష‌యంలో ఇది జ‌రిగింది. ఇప్పుడు స‌యేషా సైగ‌ల్ విష‌యంలో కూడా జ‌రుగుతుంది. ఇక్క‌డ ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చూడ్డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. స‌యేషా సైగ‌ల్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. తెలుగులో ఈమె న‌టించిన తొలి సినిమా అఖిల్ డిజాస్ట‌ర్ అయింది.

ఆ త‌ర్వాత స‌యేషా వైపు చూడ్డానికి ఎవ‌రు ఇష్ట‌ప‌డ‌ట్లేదు. కానీ ఈమెను తీసుకెళ్లి ఇప్పుడు త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం స్టార్ హీరోయిన్ ను చేసారు. ప్ర‌స్తుతం అక్క‌డ వ‌ర‌స సినిమాలు చేస్తుంది స‌యేషా. ఇప్ప‌టికే అక్క‌డ జ‌యంరవితో న‌టించిన వ‌న‌మ‌గ‌న్ యావ‌రేజ్ గా ఆడింది.

దాంతోపాటు కార్తి హీరోగా వ‌స్తున్న చిన‌బాబులో స‌యేషా హీరోయిన్.. ఇక విజ‌య్ సేతుప‌తి జంగా.. ఆర్య హీరోగా వ‌స్తోన్న భ‌లేభ‌లే మ‌గాడివోయ్ రీమేక్ గ‌జినీకాంత్ సినిమాల్లోనూ స‌యేషానే హీరోయిన్. ఇలా వ‌ర‌స సినిమాల‌తో ప్ర‌స్తుతం త‌మిళ‌నాడును షేక్ చేస్తుంది స‌యేషా సైగ‌ల్. ఇక్క‌డ అఖిల్ షాక్ ఇచ్చినా అక్క‌డ అంతా ఆద‌రిస్తున్నారు ఈ ముద్దుగుమ్మ‌ను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here