మ‌రి బాల‌య్య ఏం పాపం చేసాడు..? 

Balakrishna
ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న‌పుడు ఒక‌రికి పెట్టి మ‌రొక‌రికి పెట్ట‌లేదంటే త‌ప్పు కాదా..? ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకు ఎక్స్ ట్రా షోలు వేసుకోమ‌ని ఇటు తెలంగాణ‌.. అటు ఆంధ్రా రెండు ప్ర‌భుత్వాలు స‌పోర్ట్ చేస్తున్నాయి. ఈ విష‌యంలో నిర్మాత‌లు ముఖ్య‌మంత్రుల‌కు ధ‌న్య వాదాలు కూడా తెలిపారు. కానీ ఇదే పండ‌క్కి వ‌స్తున్న బాల‌య్య సంగ‌తేంటి..? ఆయ‌నకెందుకు ఇలాంటి ఆఫ‌ర్లు ఇవ్వ‌డం లేదు ప్ర‌భుత్వాలు..? గ‌త ఏడాది శాత‌క‌ర్ణితో వ‌చ్చిన‌పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చి గౌత‌మీపుత్రున్ని బ‌య‌ట‌ప‌డేసాయి. ఇక ఇప్పుడు జై సింహా అంటూ వ‌స్తున్నాడు నంద‌మూరి నట‌సింహం. ప‌వ‌న్ వ‌చ్చిన రెండు రోజుల‌కు అంటే జ‌న‌వ‌రి 12న జై సింహా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి ఎక్స్ ట్రా షోలు లేవు.. ప‌ర్మిష‌న్లు లేవు.. అస‌లు గోలే క‌నిపించ‌ట్లేదు. కానీ మ‌రోవైపు ప‌వ‌న్ కు మాత్రం అన్నీ వ‌చ్చేస్తున్నాయి. ఏడు రోజుల పాటు రాత్రి పూట షోలు వేసుకోమ‌ని చంద్ర‌బాబు అనుమ‌తిచ్చారు. మ‌రి ఇదే అనుమ‌తి బాల‌య్య‌కు ఎందుకు ఇవ్వ‌లేదో..? అంటే జై సింహాకు ఎక్స్ ట్రా షోస్ అవ‌స‌రం లేదా.. పోటీలోనూ ఒక్క‌డే నెట్టుకొస్తాడా..? ఏమో చూడాలిక‌.. తెర‌వెన‌క ఏం జ‌రుగుతుందో  ఎవ‌రికి ఎరుక‌..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here