మ‌హాన‌టిపై మ‌న‌సుప‌డ్డ బాలీవుడ్..!


సావిత్రి అంటే కేవ‌లం ద‌క్షిణాది ఇండ‌స్ట్రీలోనే కాదు.. ఉత్త‌రాదిన కూడా స్టారే. ఆమె అక్క‌డ కూడా కొన్ని సినిమాలు చేసింది. అవి కూడా బ్లాక్ బ‌స్ట‌ర్స్ అయ్యాయి. అందుకే సావిత్రి అంటే నార్త్ లో కూడా మహానటే. ఆమె జీవితం గురించి తెలుసుకోడానికి మనం ఎంత ఆరాట‌ప‌డుతున్నామో..
అక్క‌డ కూడా ఇదే జ‌రుగుతుంది ఇప్పుడు. దానికి నిద‌ర్శ‌నం మ‌హాన‌టి రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాత‌లు పోటీ ప‌డుతుండ‌ట‌మే. తాజాగా ఆదిత్యా చోప్రా మ‌హాన‌టి రీమేక్ రైట్స్ కోసం అశ్వినీద‌త్ తో బేర‌సారాలు న‌డుపుతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
అక్క‌డ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని చూస్తున్నారు. య‌శ్ రాజ్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ నుంచి సినిమా అంటే క‌చ్చితంగా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి.. అంచ‌నాలుంటాయి. మ‌రి మహాన‌టి కూడా ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్తుందా..? ఒక‌వేళ వెళ్తే ఇక్క‌డ తీసినంత అద్భుతంగా అక్క‌డ తెర‌పైకి ఆమె జీవితం వ‌స్తుందా అనేది అనుమానమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here