మ‌హేశ్ అలా చేస్తున్నాడంట‌.. 

Mahesh Babu Protinex
భ‌ర‌త్ అనే నేను కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు మ‌హేశ్ బాబు. ఈ సినిమా సూప‌ర్ స్టార్ కెరీర్ కు కీల‌కం. వ‌ర‌స‌గా రెండు భారీ డిజాస్ట‌ర్ల త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో భ‌ర‌త్ అనే నేనుపై ఇండ‌స్ట్రీలో కూడా భారీ అంచ‌నాలున్నాయి. దానికి తోడు హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరు మీదున్న కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు కావ‌డంతో భ‌ర‌త్ అనే నేను బిజినెస్ కూడా భారీ స్థాయిలో జ‌రుగుతుంది. ఇప్ప‌టికే 80 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ చేయాలనే క‌సితో క‌నిపిస్తున్నాడు మ‌హేశ్. అందుకే త‌న సినిమాల్లో దేనికి ఇవ్వ‌నంత టైమ్ దీనికి ప్ర‌మోష‌న్ కోసం ఇస్తున్నాడు మ‌హేశ్ బాబు. ఒక‌టి రెండు రోజులు కాదు ఏకంగా మ‌రో ప‌ని పెట్టుకోకుండా 20 రోజుల పాటు ఈ చిత్రం కోస‌మే ప్రాణం పెట్ట‌నున్నాడు మ‌హేశ్.
ఎప్రిల్ 20న సినిమా విడుద‌ల కాబ‌ట్టి.. ఎప్రిల్ 1 నుంచే భ‌ర‌త్ అనే నేను ప్ర‌మోష‌న్ కోసం తిర‌గ‌నున్నాడు మ‌హేశ్. ప్ర‌తీసారి ఏదో ఒక‌టి రెండు ఇంట‌ర్వ్యూలు ఇచ్చి చేతులు దులిపేసుకునే మ‌హేశ్ ఈ సారి మాత్రం అలా కుద‌ర‌దంటున్నాడు. అంచ‌నాలు భారీగా ఉన్నాయి కాబ‌ట్టి దాన్ని ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసే బాధ్య‌త కూడా త‌నే తీసుకుంటున్నాడు. పైగా ఈ చిత్రం త‌న‌కు అచ్చొచ్చిన ఫాద‌ర్ సెంటిమెంట్ తో వ‌స్తుంది. గ‌తంలో పోకిరి.. దూకుడు.. సీత‌మ్మ వాకిట్లో.. శ్రీ‌మంతుడు లాంటి సినిమాలు కూడా తండ్రి సెంటిమెంతోనే వ‌చ్చాయి. ఇక ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను కూడా ఇదే కోవలోకి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాడు మ‌హేశ్. ఇందులో మ‌హేశ్ కు తండ్రిగా శ‌ర‌త్ కుమార్ న‌టిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. మ‌హేశ్ చేయ‌బోయే ప్ర‌మోష‌న్ ఈ చిత్రాన్ని ఏ రేంజ్ కు తీసుకెళ్ల‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here