మ‌హేశ్ తో పూజా ఫ‌లించేలా ఉందే..!

Mahesh24
ఇండ‌స్ట్రీలో ఒక్కోసారి విజ‌యం లేక‌పోయినా ప‌ర్లేదు కానీ కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు అదృష్టం ఫెవీక్విక్ లా గ‌ట్టిగా అతుక్కుపోతుంది. ఇప్పుడు పూజాహెగ్డేను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఏడాది కింద ఈ బ్యూటీని చూస్తే ఐరెన్ లెగ్ అనిపించింది. కానీ వ్ర‌తం చెడ్డా ఫ‌లితం ద‌క్కిన‌ట్లు.. బాలీవుడ్ లో మొహింజ‌దారో డిజాస్ట‌ర్ గా నిలిచినా కూడా పూజాహెగ్డేపై ఇంకా ద‌ర్శ‌క నిర్మాత‌లు న‌మ్మ‌కం పెట్టుకుంటున్నారు. డిజే ఫ‌లితంతో సంబంధం లేకుండా పూజాహెగ్డే మాత్రం సూప‌ర్ హిట్ అయింది. ఈమె అందాలు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా న‌టిస్తున్న సాక్ష్యంలో న‌టిస్తుంది. దాంతో పాటు ఇప్పుడు మ‌హేశ్-వంశీ పైడిప‌ల్లి సినిమాలో కూడా పూజాహెగ్డేనే హీరోయిన్ గా ఫైన‌ల్ చేసార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే విష‌యం గురించి పూజా మాట్లాడుతూ ఇప్పుడే ఆ సంగ‌తి చెప్ప‌లేన‌ని త‌ప్పించుకుంది. కానీ లేదు అనే స‌మాధానం మాత్రం చెప్ప‌లేదు. పైగా ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత‌. ఆల్రెడీ డిజేకు వ‌ర్క్ చేసారు కాబ‌ట్టి మ‌ళ్లీ పూజాహెగ్డేనే తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు ఈ నిర్మాత‌. అన్నింటికీ మించి బాలీవుడ్ లో కూడా తెలిసిన అమ్మాయి. అందాల ఆర‌బోత‌లోనూ పెద్ద‌గా ప‌ట్టింపుల్లేవు. దాంతో పూజాను హీరోయిన్ గా తీసుకుంటే హిందీలో కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే మ‌హేశ్ సినిమాకు పూజాను ఆలోచిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రం కానీ వ‌ర్కవుట్ అయితే పూజా దిశ తిరిగిన‌ట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here