మ‌హేశ్ పండ‌గ చేసుకుంటున్నాడుగా..!

 

ఇండ‌స్ట్రీలో ఇప్పుడున్న కుర్ర హీరోల‌తో పోలిస్తే మ‌హేశ్ కాస్త సీనియ‌ర్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాగూ ఇప్పుడు సినిమాలు చేసేలా లేడు.. చేసినా కూడా ఆయ‌న కుర్ర హీరోల‌తో క‌ల‌వ‌డు. ఇక చిరు, బాల‌య్య బ్యాచ్ అంతా సీనియ‌ర్లు. దాంతో కుర్ర హీరోల‌కు సీనియ‌ర్ల‌కు వార‌ధిగా మారాడు మ‌హేశ్ బాబు.
ఈయ‌న ఇప్పుడు కుర్ర హీరోల‌తో క‌లిసి పార్టీలు చేసుకుంటున్నాడు. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్ల‌తో రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంటున్నాడు ఈ సూప‌ర్ స్టార్. మొన్న‌టికి మొన్న భ‌ర‌త్ అనే నేను బ‌హిరంగ స‌భ‌లో ఎన్టీఆర్ గురించి తెగ పొగిడేసాడు మ‌హేశ్. ఆ త‌ర్వాత ఆఫ్ట‌ర్ పార్టీలో చ‌ర‌ణ్ కూడా వ‌చ్చి జాయిన్ అయ్యాడు.
ఇప్పుడు మ‌రోసారి సినిమా విడుద‌లైన త‌ర్వాత పార్టీ చేసుకున్నారు. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తో క‌లిసి మ‌హేశ్ మ‌రోసారి దుమ్ము దులిపేసాడు. మొత్తానికి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వ‌స్తున్న ఈ మార్పును చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఇక అభిమానులు కూడా మ‌న హీరోల మాదిరే మారిపోతే ఎంత బాగుంటుందో క‌దా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here