మ‌హేశ్ ముందు ఓడిపోయిన బ‌న్నీ..


అవును.. ఇండ‌స్ట్రీ అన్న త‌ర్వాత ఓట‌మి గెలుపులు స‌హ‌జం. అవి ఒప్పుకోవాలి కూడా. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. మ‌హేశ్ బాబు చేతిలో బ‌న్నీ ఓడిపోయాడు. ఇంత‌కీ ఏ విష‌యంలో అనుకుంటున్నారా..? ప‌్రీ రిలీజ్ వేడుక విష‌యంలోనే.. అవును.. భ‌ర‌త్ అనే నేనుకు బ‌హిరంగ స‌భ ఎల్బీ స్టేడియంలో పెట్టారు.
అక్క‌డికి అభిమానులు ఊహించ‌ని విధంగా వ‌చ్చారు. అస‌లు అప్ప‌టి వ‌ర‌కు ఓ ఆడియో వేడుక‌కు అంత మంది జ‌నం రావ‌డం తొలిసారేమో అన్నంత‌గా స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇదే స్టైల్ లో గ‌చ్చిబౌలి ఓపెన్ స్టేడియంలో నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. దీనికి కూడా మెగా అభిమానులు కోకొల్ల‌లుగా వ‌స్తార‌ని ఊహించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఎంత‌లా అంటే క‌నీసం స్టేడియం కూడా నిండ‌లేదు. చాలా చోట్ల ఖాళీలు క‌నిపించాయి. చ‌ర‌ణ్.. అర్జున్ లాంటి స్టార్ హీరోలు వ‌చ్చినా కూడా ఎందుకో కానీ అభిమానులు మాత్రం ఊహించినంత‌గా రాలేదు. బాగానే వ‌చ్చారు..
కానీ బాగా చెప్పుకునేంత అయితే రాలేదు. ఇదొక్క‌టే నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌లో మైన‌స్ గా క‌నిపించింది. అది మిన‌హాయిస్తే ఫంక్ష‌న్ మాత్రం చాలా బాగా జ‌రిగింది. బ‌న్నీ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా క‌నిపిస్తున్నాడు. మే 4న వచ్చి క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తాన‌నే ధీమాతోనే ఉన్నాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here