యాడ్ పిల్ల మామూలు అరాచ‌కం కాదుగా..!


ఇంత‌కీ ఎవ‌రా పిల్ల అనుకుంటున్నారా..? ఇంకెవ‌ర‌కు నేల‌టికెట్ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్న మాళ‌విక శ‌ర్మ గురించే మ‌నం ఇప్పుడు మాట్లాడుకుంటున్న‌ది. అస‌లు టీజ‌ర్ లో ఈ భామ‌ను చూస్తుంటే బాబోయ్.. ఇంత ప‌ద్ద‌తిగా ఉందేంటి.. ఇలా ఉంటే నెగ్గుకొస్తుందా అనుకున్నారు.
కానీ ఆడియో వేడుక‌లో అందాల‌తో పాటు టాలెంట్ అంతా చూపించేసింది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు ఈ భామ‌ను చూసి అక్క‌డున్నోళ్లంతా ముక్కున వేలేసు కున్నారు. బాబోయ్ పిల్ల మ‌రీ అరాచ‌కం క‌దా అనుకోని వాళ్లుండ‌రు. మాట‌లు.. అందాలు.. రెండూ తూటాల్లా వాడేసింది మాళ‌విక‌. ఏదో చుట్ట‌పుచూపు కాదు.. క‌చ్చితంగా ఇక్క‌డే ఉండాల‌ని బ‌ట్ట‌ల‌న్నీ స‌ర్దుకునే తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ బ్యూటీ. అర్థ‌మైపోతుంది అది ఆమె చేత‌ల‌తోనే. ఈ మ‌ధ్యే ఈ బ్యూటీ ఫోటో షూట్ ఒక‌టి విడుద‌లైంది. ఇందులో అందాల‌న్ని విచ్చ‌ల‌విడిగా ఆర‌బోసింది.
ఇది చూసి వామ్మో.. పాప చాలా హాట్ గురు అనుకున్నారు. అంత‌లోనే ఇలా ఆడియో వేడుక‌లో అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించింది. ఇప్ప టికే చాలా యాడ్స్ లో న‌టించింది మాళ‌విక శ‌ర్మ‌. టీవీల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు సినిమాల్లోకి వ‌చ్చేస్తుంది.
ర‌వితేజ లాంటి స్టార్ హీరో సినిమాతోనే ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది మాళ‌విక‌. అమ్మ‌డు అందాల ఆర‌బోత చూస్తుంటే త్వ‌ర‌లోనే తెలుగులో ప‌క్కా సెటిలైపోయేలా క‌ళ‌లైతే క‌చ్చితంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. నేల‌టికెట్ విడుద‌లైన త‌ర్వాత తెలుస్తుంది మాళ‌విక స్టామినా ఏంటో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here