యు ట‌ర్న్ తీసుకుంటున్న భూమిక‌..


సీనియ‌ర్ హీరోయిన్లు అంతా ఇప్పుడు అక్క‌లు.. వ‌దిన‌లుగా తెగ బిజీ అయిపోతున్నారు. ఇదే లిస్ట్ లో ఇప్పుడు భూమిక కూడా చేరిపోయింది. ఖుషీ లాంటి సినిమాల్లో త‌న న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్ తో ఓ ఊపు ఊపిన భూమిక‌.. ఇప్పుడు ముఖ్య భూమిక‌లు చేస్తుంది. అంటే స‌పోర్టింగ్ యాక్ట్రెస్ట్ గా న‌టిస్తూ బిజీ అవుతుంద‌న్న‌మాట‌. మొన్నటికి మొన్న నాని ఎంసిఏలో వ‌దిన‌గా ర‌ప్ఫాడించింది భూమిక‌.
యోగా గురువు భ‌ర‌త్ ఠాకూర్ ను పెళ్ళి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది భూమిక‌. ఆర్థికంగా కూడా భూమిక ప‌రిస్థితి పెద్ద‌గా చెప్పుకోడానికి ఏమీ లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో ఈ మ‌ధ్యే మ‌ళ్లీ సినిమాల వైపు వ‌చ్చింది ఈ భామ‌. ఈ మ‌ధ్యే ధోనీ సినిమాలో ఎమ్మెస్ ధోనీకి అక్క పాత్ర‌లో న‌టించిన భూమిక‌.. ఎంసిఏలో భూమిక పాత్ర ప్రాణం. భూమిక కూడా ఈ పాత్ర‌కు తాను త‌ప్ప మరొక‌రు సూట్ కార‌నే రేంజ్ లో రెచ్చిపోయింది.
దాంతో ఈమెకు తెలుగులో ఆఫ‌ర్లు పెరిగిపోతున్నాయి. తాజాగా నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న స‌వ్య‌సాచిలోనూ భూమిక ప్ర‌ధాన భూమిక పోషిస్తుంద‌ని తెలుస్తుంది. ఇందులోనూ చైతూకు వ‌దిన పాత్ర‌లోనే భూమిక న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు స‌మంత, ఆది జంట‌గా ప‌వ‌న్ కుమార్ తెర‌కెక్కిస్తోన్న యు ట‌ర్న్ సినిమాలో భూమిక ఓ ముఖ్య భూమిక పోషిస్తుంది. తాజాగా ఈ షూటింగ్ లో కూడా అడుగు పెట్టింది భూమిక‌. మొత్తానికి చూడాలిక‌.. భూమిక సెకండ్ ఇన్నింగ్స్ తెలుగులో ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here