రంగ‌మ్మ‌త్త మామూలుగా లేదుగా.. 

Anasuya
అన‌సూయ అంటే ఇన్నాళ్లూ మ‌న‌కు గుర్తొచ్చే ఇమేజ్ వేరు. ఈమె.. అందాల ఆర‌బోత‌.. యాంక‌రింగ్.. ఇలా ఏంటేంటో గుర్తొచ్చేవి. కానీ సుకుమార్ మాత్రం అన‌సూయ‌లో మ‌రో యాంగిల్ చూసాడు. ఇదే ఇప్పుడు రంగ‌స్థ‌లంలో క‌నిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రంగ‌స్థ‌లంలో అన‌సూయ పాత్ర ఏంటి అనేది బ‌య‌టికి రాలేదు.. వ‌చ్చినా అన్ని రూమ‌ర్లే. ఇప్పుడు దానిపై కావాల్సినంత క్లారిటీ వ‌చ్చేసింది. అస‌లు ఈ చిత్రంలో అన‌సూయ ఉంద‌న‌గానే  అంతా ఐటం సాంగ్ కోస‌మే అనుకున్నారు. కానీ త‌ర్వాత అది కాద‌ని తేలిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి అన‌సూయ పోస్ట‌ర్ బ‌య‌టికొచ్చింది. ఇది చూసిన త‌ర్వాత వామ్మో అన‌సూయ‌.. అనుకోక త‌ప్ప‌దు. ఎందుకంటే అలా ఉంది ఈ స్టిల్. రంగ‌మ్మ‌త్తగా ఇందులో న‌టిస్తుంది అన‌సూయ‌. దీనికి సంబంధించిన స్టిల్ ఇప్పుడు కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తుంది.
పిక్క‌లు చూపిస్తూ అన‌సూయ ఇచ్చిన పోజు అమ్మో అనిపించ‌క మాన‌దు. రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా అనసూయ క‌నిపిస్తుంది. ఈ పాత్ర పూర్తిగా పల్లెటూరి అమ్మాయిలా ఉంటుంది. అనసూయ పాత్రను సుకుమార్ అద్భుతంగా డిజైన్ చేసాడ‌ని తెలుస్తోంది. అందుకే అత్త పాత్రైనా అడ‌గ్గానే కారెక్ట‌ర్ న‌చ్చి ఒప్పేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇంత చిన్న ఏజ్ లోనే అత్త‌ను చేసినందుకు అన‌సూయ‌కు సారీ కూడా చెప్పాడు సుకుమార్. కానీ ఈ సినిమా త‌ర్వాత క‌చ్చితంగా అన‌సూయకు ఆఫ‌ర్లు పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం మార్చ్ 30న విడుద‌ల కానుంది. మొత్తానికి రంగ‌స్థ‌లం క‌చ్చితంగా త‌న కెరీర్ కు బూస్ట‌ప్ ఇస్తుంద‌ని న‌మ్ముతుంది అన‌సూయ‌. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here