రంగ‌స్థ‌లంను దాట‌లేక‌పోతున్న భ‌ర‌త్..


ఈ ఏడాది వ‌చ్చిన సినిమాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ ఏదంటే మ‌రో మాట లేకుండా చెప్పే మాట రంగ‌స్థ‌లం. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 40 కోట్ల లాభాలు తెచ్చింది ఈ చిత్రం. నిర్మాత‌ల‌కు అయితే ఇంకా ఎక్కువే మిగిల్చింది. ఇప్ప‌టికే 116 కోట్ల షేర్ వ‌సూలు చేసింది రంగ‌స్థ‌లం.
ఈ సినిమా రికార్డుల‌ను అందుకోడానికి ఏ సినిమాకైనా మ‌రికొంత కాలం ప‌డుతుంద‌నుకున్నారంతా. కానీ భ‌ర‌త్ అనే నేను నేనున్నానంటూ వ‌చ్చేసాడు. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే 57 కోట్ల షేర్ వసూలు చేసి.. రంగ‌స్థ‌లంను దాటేసింది. దాంతో తొలివారం వ‌సూళ్ల‌తో పాటు ఫుల్ ర‌న్ లో కూడా క‌చ్చితంగా సిట్టిబాబును భ‌ర‌త్ దాటేస్తాడేమో అనుకున్నారు కానీ ఇప్పుడు అది అంత ఈజీగా అనిపించ‌ట్లేదు.
ఎందుకంటే ఐదు రోజులు ముగిసిన త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్త వ‌సూళ్ల‌లో రంగ‌స్థ‌లం 70 కోట్లు తీసుకొస్తే.. భ‌ర‌త్ మాత్రం 66 కోట్ల షేర్ ద‌గ్గ‌రే ఆగిపోయింది. పైగా రంగ‌స్థ‌లం కంటే భ‌ర‌త్ అనే నేను ఎక్కువ థియేట‌ర్స్ లో విడుద‌లైంది. అయినా కానీ ఎందుకో సిట్టిబాబును ట‌చ్ చేయ‌లేదు భ‌ర‌త్. మొత్తానికి ఇప్పుడు ఫుల్ ర‌న్ లో 100 కోట్ల షేర్ దాటుతుందేమో కానీ క‌చ్చితంగా సిట్టిబాబును దాట‌డం మాత్రం క‌ష్ట‌మే. మ‌రి చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు భ‌ర‌త్ పోరు ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here