రంగ‌స్థ‌లంపై ప‌వ‌న్ నో క‌మెంట్స్..


ఏమైందో తెలియ‌దు కానీ ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా కాస్త ఫ్యామిలీకి టైమ్ ఇస్తున్నాడు. ఎంట‌ర్ టైన్మెంట్ కోరుకుంటున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు అంటూ తిరిగిన ప‌వ‌న్.. ఈ మ‌ధ్యే కాస్త కుటుంబంతో గ‌డుపుతున్నాడు. మొన్న‌టికి మొన్న అబ్బాయి రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే కు చిరు ఇంటికి వ‌చ్చి ఆతిథ్యం స్వీక‌రించాడు.
ఇక ఈ మ‌ధ్యే అకీరా బ‌ర్త్ డే కు కొడుకుతో కాసేపు గ‌డిపాడు. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాను చూసాడు ప‌వ‌ర్ స్టార్. అది కూడా ప్రేక్ష‌కుల మ‌ధ్య కూర్చుని. ఎందుకో తెలియ‌దు కానీ తొలిప్రేమ త‌ర్వాత త‌న‌కు ఓ సినిమా మ‌ళ్లీ థియేట‌ర్ లోనే చూడాల‌నిపించింది అని చెప్పాడు ప‌వన్ క‌ళ్యాణ్. ఐమాక్స్ లో ప్రేక్ష‌కుల మ‌ధ్య సినిమా చూసిన ప‌వ‌ర్ స్టార్..
చూసిన త‌ర్వాత మాత్రం ఏం మాట్లాడ లేదు. ఆ మౌనానికి మ‌రో కార‌ణం కూడా ఉంది. ఈయ‌న రంగ‌స్థ‌లం సక్సెస్ మీట్ కు వ‌స్తున్నాడు. త్వ‌ర‌లోనే భారీ ఎత్తున ఈ కార్య‌క్ర‌మం చేయ‌బో త‌తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మిగిలిన విష‌యాలు స‌క్సెస్ మీట్ లో మాట్లాడ‌తానంటూ చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. అంటే ఈ లెక్క‌న అబ్బాయి వేడుక‌కి బాబాయ్ వ‌స్తున్న‌ట్లే లెక్క‌. మ‌రి చూడాలిక‌.. ఒకే వేదిక‌పై అబ్బాయి బాబాయ్ క‌లిసి ఏం ర‌చ్చ చేయ‌బోతున్నారో..? అప్పుడెప్పుడో నాయక్ ఆడియో వేడుక‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చాడు. మ‌ళ్లీ ఇప్పుడు స‌క్సెస్ మీట్ కు వ‌స్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here