రంగ‌స్థ‌లంలో స‌మంత సంపేస్తుందిగా..

 

ఇప్ప‌టి వ‌ర‌కు రంగ‌స్థ‌లం అంటే రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే గుర్తొచ్చేవాడు. కానీ ఇప్పుడు స‌మంత కూడా సంపేస్తుంది. ఆమె లుక్ ఇప్పుడు కేక పెట్టిస్తుంది. అస‌లు మ‌నం చూస్తున్న‌ది స‌మంత‌నేనా అనే అనుమానం వ‌చ్చేంతగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. గేదెల్ని కాసుకుంటూ స‌మంత ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయిలా మారిపోయింది. సుకుమార్ మార్చేసిన విధానం చూసి అంతా షాకైపోతున్నారు. రామ్ చ‌ర‌ణ్నే మార్చేసాడేమో అనుకుంటే.. ఇప్పుడు స‌మంత లుక్ ఇంకా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. రామ్ చ‌ర‌ణ్ చెవుడు ఉన్న పాత్ర‌లో న‌టిస్తుంటే.. స‌మంత కూడా కాస్త ఛాలెంజింగ్ రోల్ చేస్తుంది ఈ చిత్రంలో. సినిమాలో చ‌ర‌ణ్, స‌మంత పాత్ర‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నాడు సుకుమార్. ఇప్ప‌టికే విడుద‌లైన స్టిల్స్ చూస్తుంటే సినిమాపై ఆస‌క్తి అలా పెరిగిపోతుంది. ఇక ఇప్పుడు గేదెను కాసుకుంటూ విడుద‌లైన స‌మంత స్టిల్స్ చూస్తుంటే అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. మార్చ్ 30న రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here