రంగ‌స్థ‌లం దెబ్బ‌కు ఛ‌ల్ మోహ‌న్ రంగా..

Chal Mohan Ranga
ఊహించిందే జ‌రిగింది. ఛ‌ల్ మోహ‌న్ రంగాకు మంచి టాక్ వ‌చ్చింది. కానీ క‌లెక్ష‌న్ల విష‌యానికి వ‌చ్చేస‌రికి సినిమా దూకుడు అంత చూపించ‌ట్లేదు. దానికి కార‌ణం ఏంటో కాదు రంగ‌స్థ‌లం. అవును.. ఈ చిత్రానికి పోటీగా విడుద‌ల‌వుతున్న‌పుడే అంతా అనుకున్నారు నితిన్ రిస్క్ చేస్తున్నాడ‌ని. ఇప్పుడు ఇదే నిజ‌మైంది.
ఎందుకంటే ఓ వైపు రంగ‌స్థ‌లం ఎమోష‌న‌ల్ గా ప్రేక్ష‌కుల గుండెల్లోకి దూసుకెళ్లిపోయింది. ఇప్ప‌టికీ ఫ్యామిలీస్ ఈ చిత్రం కోసం ఎగ‌బడుతున్నారు. చాలా కాలం త‌ర్వాత తెలుగులో ఓ పెద్ద సినిమాకు ఇంత భారీ ఓపెనింగ్స్ కానీ.. లాంగ్ ర‌న్ కానీ చూస్తున్నాం. రిలీజైన 10 రోజుల త‌ర్వాత హౌజ్ ఫుల్ బోర్డులు క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు.
ఈ మ‌త్తులో ప‌డి ఇప్పుడు నితిన్ సినిమాను పట్టించుకోవ‌డం లేదు. ఈ చిత్రం తొలిరోజు 3 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. కానీ రెండో రోజుకే ఆ వ‌సూళ్ల సంఖ్య ప‌డిపోయింది. ఛ‌ల్ మోహ‌న్ రంగా రెండో రోజు తెచ్చిన వ‌సూళ్ల కంటే.. రంగ‌స్థ‌లం 9వ రోజున వ‌సూలు చేసింది ఎక్కువ‌. దీన్నిబ‌ట్టే అర్థ‌మైపోతుంది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సిట్టిబాబు ర‌ణ‌రంగం ఎలా సాగుతుందో చెప్ప‌డానికి..? ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే నితిన్ కు మ‌రోసారి సారి త‌ప్పేలా లేదు. ఎందుకంటే ఛ‌ల్ మోహ‌న్ రంగా సేఫ్ కావాలంటే అక్ష‌రాలా 16 కోట్లు వ‌సూలు చేయాలి. ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే అది క‌ష్టంగానే అనిపిస్తుంది మ‌రి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here