రంగ‌స్థ‌లం రంగ‌మ్మ వ‌చ్చేస్తుంద‌హో..!

Rangasthalam song
రంగ‌స్థ‌లంలో మ‌రో పాట వ‌చ్చేస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. రంగ‌స్థ‌లం టైటిల్ సాంగ్ తో పాటు మొద‌ట్లో విడుద‌లైన ఎంత స‌క్క‌గున్నావే పాట‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మూడో పాట‌కు రంగం సిద్ధ‌మైంది. మార్చ్ 8 సాయంత్రం 6 గంట‌ల‌కు రంగ‌మ్మ మంగ‌మ్మ పాట విడుద‌ల కానుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌ను చంద్ర‌బోస్ ర‌చించారు. రంగ‌మ్మ మంగ‌మ్మ పాట‌లో ముందు నుంచి పూజాహెగ్డే చిందేసింది అనుకున్నారు కానీ ఇప్పుడు విడుద‌లైన పోస్ట‌ర్ చూస్తుంటే ఇందులోనూ స‌మంతే క‌నిపిస్తుంది. రామ్ చ‌ర‌ణ్, స‌మంతపై వ‌చ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. అన‌సూయ పాత్ర పేరు కూడా ఇందులో రంగ‌మ్మ ఉండేస‌రికి.. ఈ పాట‌లో ఆమె కూడా చిందేస్తుందేమో అనుకున్నారు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ఇప్పుడు స‌మంత‌, చ‌ర‌ణ్ ఈ పాట‌తో వ‌స్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌లు ఛార్ట్ బ‌స్ట‌ర్స్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట వ‌స్తుంది. సినిమాలోని మొత్తం పాట‌లు మార్చ్ 18న విడుద‌ల కానున్నాయి. వైజాగ్ లో రంగ‌స్థ‌లం భారీ ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. అక్క‌డే అన్ని పాట‌లు విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మార్చ్ 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here